బ్యాక్ గ్రౌండ్ తో పైకి వచ్చిన కూతుళ్లు సక్సెస్ అయ్యారా…?

star heroes daughters:స్టార్ హీరోలు తమ వారసులుగా హీరోలను దింపడానికి ఇష్టపడినంతగా హీరోయిన్స్ ని దించడానికి ఇష్టపడరు. దీనికి తోడు ఫాన్స్ కూడా స్టార్ హీరోల కూతుళ్లను హీరోయిన్స్ గా రావడానికి ససేమిరా అంటుంటారు. అయితే ఇప్పుడిప్పుడే హీరోయిన్స్ కూడా స్టార్ హీరోల ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల హీరోయిన్ గా ఎంట్రీకి ఫాన్స్ అసలు ఒప్పుకోలేదు. దాంతో దూరంగానే పెట్టారు. కానీ ఆతర్వాత షో వంటి సినిమాల్లో నటించి తన నటనతో ఆకట్టుకుంది.

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గుండెలో గోదారి,అనగనగా ఒక ధీరుడు వంటి సినిమాల్లో మంచి నటన కనబరిచింది. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ,విశాల్ హీరోగా తమిళ మూవీలో నటించింది. ఇక తమిళ హీరో విజయకుమార్,మంజుల దంపతుల ముగ్గురు కూతుళ్ళల్లో వనితా దేవి చిత్రంలో,ప్రీతి రుక్మిణి మూవీలో,శ్రీదేవి ఈశ్వర్ మూవీలో నటించారు. మెగా డాటర్ నిహారిక విషయానికి వస్తే, నాగబాబు కుమార్తె. నిహారిక సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఒక మనసు,హ్యాపీ వెడ్డింగ్,సూర్యకాంతం వంటి సినిమాల్లో చేసింది. పలు వెబ్ సిరీస్ కూడా చేస్తోంది.

కమల్ హాసన్ కూతుళ్లు శృతిహాసన్, అక్షర హాసన్ కూడా హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా సినీ ఎంట్రీ ఇచ్చి, హీరోయిన్ గా దూసుకెళ్తోంది. ఇక ఒకప్పటి హీరో దివంగత రాజేష్ కూతురు ఐశ్వర్య రాజేష్ కూడా కౌసల్య కృష్ణమూర్తి, ఫేమస్ లవర్ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటిచింది. యాంగ్రీ స్టార్ డాక్టర్ రాజశేఖర్ కూతుళ్లు శివాని,శివాత్మిక ఎంట్రీకి సిద్ధమయ్యారు. ఇందులో శివాత్మిక గత ఏడాది దొరసాని మూవీలో చేసింది. కామెడీ,క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉత్తేజ్ కూతురు కూడా పిచ్చిపిచ్చిగా నచ్చావ్ మూవీలో నటించింది. ఇక బాలీవుడ్ లో కరీనా కపూర్,శ్రద్ధా కపూర్,అలీఖాన్ లాంటి వాళ్ళు ఇప్పటికే లీడ్ లో ఉన్నారు.