ఆరెంజ్ సినిమాలో నటించిన హీరోయిన్ ని గుర్తు పట్టారా… ఈమె తల్లి కూడా నటి…?
Guess The Actress: హీరో హీరోయిన్స్ పిల్లలే కాదు ఇతర నటీ నటుల పిల్లలు కూడా ఇండస్ట్రీలో తమ తమ పాత్రలతో రాణిస్తున్నారు. ఇక చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా నట వారసత్వాన్ని పుచ్చుకుని తమ సత్తా చాటుతున్నారు. అందులో ముఖ్యంగా హ్యాపీ డేస్ లో అప్పు పాత్రలో రాణించిన గాయత్రీ రావు గురించి చెప్పుకోవాలి. నిజానికి హ్యాపీ డేస్ సినిమాతో ఆమె ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. తర్వాత ఆరెంజ్ సినిమాలో మాయ పాత్రలో చేసి, ఆ తర్వాత గబ్బర్ సింగ్ లో కూడా శృతి హాసన్ ఫ్రెండ్ గా దర్శనమించారు.
అంతేకాదు, గంగపుత్రులు సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. గాయత్రీ రావు కి పెళ్లయింది. హ్యాపీ డేస్ లో చేసిన అప్పు పాత్ర కి , ఆరెంజ్ సినిమాలో చేసిన మాయ పాత్ర కి, అలాగే గబ్బర్ సింగ్ లో చేసిన పాత్ర కి ఏమాత్రం పోలిక లేకుండా విభిన్న పాత్రలను ఎంచు కున్నారు. ఇలా ఏ పాత్ర కి ఆ పాత్ర డిఫరెంట్ గా ఉండడంతో తక్కువ సమయంలోనే తక్కువ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఒక చిత్రంలో నటించారట.
ఇంతకీ గాయత్రి తల్లి పద్మ కూడా ఒకప్పుడు ఎన్నో సినిమాల్లో, సీరియల్స్ లో సహాయ పాత్రల్లో చేసి,మెప్పించారు. ముఖ్యంగా గాయత్రీ నటించిన హ్యాపీ డేస్ సినిమాలో కూడా నిఖిల్ తల్లి పాత్ర లో పద్మ నటించారు. ఇప్పటికి కూడా ఎంతోమంది ప్రేక్షకులు అప్పు క్యారెక్టర్ గుర్తు పెట్టుకున్నారు అంటే, గాయత్రి ఎంత బాగా నటించారో అర్థం చేసుకోవచ్చు. కానీ తర్వాత వచ్చిన సినిమాలు ఈమెకు పెద్దగా పేరు తెచ్చిపెట్టలేదు.