Healthhealth tips in telugu

ఈ ఒక్క ఆకు నూరి పొట్ట మీద రాసి మసాజ్ చేస్తే 7 రోజుల్లో పొట్ట తగ్గిపోతుంది

Uttareni leaves Benefits In telugu :ప్రకృతి మనకు అందించిన ఎన్నో మొక్కలు ఆయుర్వేదం ప్రకారం అనేక రోగాలకు చికిత్సలో సహాయ పడుతున్నాయి. ఈ మొక్కలు అన్నీ .మన చుట్టుపక్కల ఉంటాయి. కానీ వాటి గురించి పెద్దగా తెలియక ఏవో పిచ్చి మొక్కలు గా భావిస్తాం. అలాంటి మొక్కలలో ఉత్తరేణి మొక్క ఒకటి. దీనిలో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. .uttareni
ఉత్తరేణి మొక్కలను తెచ్చుకొని నీడలో బాగా ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత ఆ మొక్కను కాల్చి బూడిద చేయాలి. ఈ బూడిదకు 16 రెట్ల నీటిని కలిపి ఆ నీటిని వడకట్టాలి ఈ నీటిని మరిగించాలి. అప్పుడు గిన్నెలో చివరికి తెల్లని పొడి మిగులుతుంది. దీనిని ఉత్తరేణి క్షారం అని అంటారు. ఈ పొడి ఎన్నో సమస్యల పరిష్కారానికి సహాయపడుతుంది.పావు స్పూన్ పొడి నీటిలో లేదా తేనెలో కలిపి తీసుకుంటే శ్వాస సమస్యలు అన్ని తొలగిపోతాయి.
Weight Loss tips in telugu
అదే అధిక బరువు సమస్యతో ఉన్న వారికి అలాగే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకు పోయిన వారికి ఉత్తరేణి ఆకును ఎలా ఉపయోగించాలో చూద్దాం పావు లీటర్ నువ్వుల నూనె తీసుకొని దానిలో పావు లీటర్ ఉత్తరేణి ఆకుల రసం కలిపి పొయ్యి మీద పెట్టి ఉత్తరేణి ఆకుల రసం మొత్తం ఇగిరిపోయేలా మరిగించాలి.
weight loss
అప్పుడు ఉత్తరేణి ఆకు లో ఉన్న లక్షణాలు అన్నీ ఆ నూనెలో.కి చేరతాయి ఈ నూనెను నిల్వచేసుకుని ఎక్కడైతే కొవ్వు బాగా పేరుకుపోయిందో అక్కడ ఈ నూనెను రాసి మసాజ్ చేయాలి. ఈ విధంగా ప్రతి రోజూ చేస్తూ ఉంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. ఉత్తరేణి ఆకులను పేస్ట్ గా చేసి గాయాల మీద రాస్తే తొందరగా ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.