Healthhealth tips in telugu

Pista Pappu Benefits: రోజుకు ప‌ది పిస్తా పప్పులు తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..?

Pista Pappu Benefits: రోజుకు ప‌ది పిస్తా పప్పులు తింటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..? ఖరీదైనా వదులుకోరు..! మనలో చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని ఇష్టంగా తింటుంటారు.

అలా తినే డ్రైఫ్రూట్స్ లో పిస్తా పప్పు ఒకటి. పసుపుపచ్చ వర్ణంలో ఉండే పిస్తా పప్పు ఒక ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. అందుకే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. పిస్తా పప్పు ధర కాస్త ఎక్కువగా ఉన్నా సరే పోషకాలు మాత్రం అధికంగా ఉంటాయి.

పిస్తా పప్పులో ఐరన్‌, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్ప‌ర‌స్‌, విట‌మిన్ B, A, E, ప్రోటీన్, ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్స్ వంటివి సమృద్దిగా ఉంటాయి. పిస్తా పప్పును లిమిట్ గా తీసుకుంటే గుండె సమస్యలు తగ్గటమే. కాకుండా మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. పిస్తాను ఎక్కువగా తీసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది.

పిస్తాలో కాల్షియం, ఆక్సాలేట్ సిస్టైన్ కిడ్నీల్లో పెరుకుపోయి రాళ్లుగా ఏర్పడతాయి. అలర్జీ ఉన్నవారు పిస్తా పప్పుకి దూరంగా ఉంటేనే మంచిది. అంతేకాక క‌డుపు నొప్పి, మ‌ల‌బ‌ద్ధ‌కం, అతిసారం వంటి స‌మ‌స్య‌లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఏదైనా లిమిట్ గా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.