MoviesTollywood news in telugu

నమ్రత తన ప్రేమ గురించి మహేష్ కంటే ముందు ఏ హీరోకి చెప్పిందో తెలుసా?

Mahesh babu And Namrata:మహేష్ బాబు సతీమణి నమ్రత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం తన భర్త బిజినెస్ విషయాలను మొత్తం నమ్రత నే డీల్ చేస్తున్నారు. ఇక కుటుంబ విషయాలను కూడా నమ్రత దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే నమ్రతతో పెళ్ళైన తరువాత మహేష్ క్రేజ్ డబుల్ అయ్యిందని చెప్పాలి.
mahesh babu
ఆయన మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. ఇక నమ్రత తెలుగులో ‘వంశీ’ చిత్రం చేయడానికి ముందే బాలీవుడ్లో చాలా సినిమాలు చేసింది. ‘వంశీ’ చిత్రం సమయంలో మహేష్ తో ఈమె ప్రేమలో పడిందంట. మహేష్ ను ప్రేమిస్తున్నాననే విషయం మహేష్ కంటే ముందుగా ఓ హీరోకి చెప్పానంటూ నమ్రత ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొస్తుంది.
Namrata
తాజాగా నమ్రత మీడియాతో మాట్లాడుతూ… “అప్పట్లో బాలీవుడ్‌లో చేసిన ‘వాస్తవ్’ సినిమాలో సహ నటుడుగా చేసిన సంజయ్ దత్‌ తో నాకు మంచి స్నేహం ఏర్పడింది. ‘వాస్తావ్’ సెట్లో సంజు ఎపుడూ చిన్న పిల్లాడిలా ప్రవర్తించే వాడు. సెట్లో అందరినీ కంటికి రెప్పలా చూసుకునే వాడు. ఆ సినిమా షూటింగ్ జరిగినన్నాళ్ళూ సంజయ్ నాతో పాటు సహ నటులతో కూడా ఎంతో సరదాగా ఉండేవారు.

ఇక ‘వంశీ’ సినిమా షూటింగ్ సమయంలో నేను మహేష్ తో ప్రేమలో ఉన్నాను.. అనే విషయాన్ని ముందుగా సంజయ్ దత్‌కే చెప్పాను. మా ప్రేమ విషయం తెలిసిన మొదటి వ్యక్తి కూడా సంజయ్ దత్తే” అంటూ చెప్పుకొచ్చింది నమ్రత.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."