MoviesTollywood news in telugu

నాగబాబు భార్య పద్మజ ఎవరి కూతురో తెలుసా…నమ్మలేని నిజాలు

Naga Babu Wife Padmaja :టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయన వేసిన బాటలోనే నాగబాబు,పవన్ కళ్యాణ్,రామ్ చరణ్,అల్లు అర్జున్ లు ఇండస్ట్రీ కి వచ్చి తమకంటూ ఒక సొంత ఇమేజ్ ని క్రియేట్ చేసుకోవటంలో సఫలం అయ్యారు. ముఖ్యంగా వీరిలో నాగబాబు గురించి చర్చించుకుంటే అయన క్యారెక్టర్ రోల్స్ కి మాత్రమే పరిమితం అయ్యారు.

ఒక పక్క క్యారెక్టర్ రోల్స్ చేసుకుంటూ నిర్మాతగా మారి మంచి మంచి సినిమాలను తీశారు. అయితే రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఆరెంజ్ సినిమా దెబ్బతో నిర్మాణ రంగం వైపుకు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఈ మధ్యనే మరల నా పేరు సూర్య సినిమాతో నిర్మాతగా మారారు.

నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ సినిమాల్లో దూసుకుపోతున్నాడు. కూతురు నిహారిక వెబ్ సిరీస్ లు,సినిమాలు చేస్తూ కెరీర్ ని ఆస్వాదిస్తూ ముందుకు సాగుతుంది. నాగబాబు విజయాల వెనక అయన భార్య పద్మజ ఉంది. చిరంజీవి సరైన వయస్సులోనే పెళ్లి చేసుకున్న నాగబాబు మాత్రం 29 సంవత్సరాల వరకు బ్రహ్మచారిగానే ఉండిపోయాడు.

రుద్రవీణ షూటింగ్ సమయంలో నాగబాబు బిజీగా ఉన్నాడు. ఆ సమయంలో నాగబాబు తల్లి అంజనాదేవి పద్మజను బంధువుల పెళ్ళిలో చూసి ఎవరీ అమ్మాయి బాగుంది అని అనుకున్నదట. పద్మజ పెళ్లి కొడుకు తరుపున అమ్మాయి అయితే,అంజనాదేవి పెళ్లికూతురు తరుపున పెళ్ళికి వచ్చారట.
Naga babu wife padmaja
పద్మజ బంధువుల అమ్మాయని తెలిసి అంజనాదేవి సంబరపడింది. ఆమె సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. ఈ అమ్మాయి తన ఇంటి కోడలు అయితే బాగుండును అని అనుకున్నదట. ముఖ్య విషయం ఏమిటంటే పద్మజ చిరంజీవికి పెద్ద వీరాభిమాని. చిరంజీవికి సంబందించిన పేపర్ కటింగ్స్ తో పెద్ద ఆల్బమ్ ని తయారుచేసిందట. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఆల్బమ్ ని చూపించేదట.

అలాగే వారి ఇంటికి వచ్చిన అంజనాదేవికి కూడా ఈ ఆల్బమ్ చూపించటంతో అంజనాదేవి మురిసిపోయి ఆమెను తన ఇంటి కోడలిగా చేసుకోవాలని డిసైడ్ అయిందట. తన అభిమాని నాగబాబు భార్యగా రావటం చిరు కూడా స్వాగతించాడు. ఆ విధంగా పద్మజ నాగబాబును పెళ్లి చేసుకొని మెగా ఫ్యామిలిలో భాగం అయింది.

అప్పటి నుండి ఇప్పటివరకు పద్మజ వివాదాల జోలికి వెళ్ళటం జరగలేదు. భర్త,పిల్లల కోసం పాటు పడింది. ఆమె గార్మెంట్ బిజినెస్ చేస్తూ నాగబాబుకి సాయంగా ఉండేది. ఒక దశలో నాగబాబు నిర్మాతగా డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు పద్మజ ఎంతో సహాయం చేసింది.తన నగలు అమ్మి అప్పులు తీర్చమని చెప్పగా, ఆ విషయం తెలిసిన చిరంజీవి,పవన్ కళ్యాణ్ చాలా బాధపడ్డారట. ఆ సమయంలోనే చిరు,పవన్ కలిసి నాగబాబుని ఆర్ధికంగా గట్టెకించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.