1 గ్లాసు – అజీర్ణం,మలబద్దకం,గ్యాస్,ఆకలి లేకపోవటం,వికారం అనేవి లేకుండా చేస్తుంది
Gas Problem : ఈ రోజుల్లో మనలో చాలా మందికి మసాలా ఆహారాలు తీసుకున్నప్పుడు, మోతాదుకి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్న ప్పుడు, తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది ఇంగ్లీష్ మందులు వేసుకుంటూ ఉంటారు.

అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం వస్తుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే గ్యాస్ సమస్య తగ్గటమే కాకుండా వేసవిలో వచ్చే నీరసం,అలసట,నిస్సత్తువ వంటివి కూడా తగ్గుతాయి. ఈ డ్రింక్ తయారుచేయటం కూడా చాలా సులువు. ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగించాలి.

జీలకర్ర వేగాక ఒక గ్లాసు నీటిని పోసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగిన జీలకర్ర నీటిని గ్లాసు లోకి వడకట్టి దానిలో చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ పటికబెల్లం పొడి, అరచెక్క నిమ్మరసం వేసి బాగా కలిపి తాగాలి. డయాబెటిస్ ఉన్నవారు పటికబెల్లం లేకుండా తాగాలి. ఈ డ్రింక్ గోరువెచ్చగా తాగవచ్చు…లేదా Ice Cubes వేసుకొని చల్లగా కూడా తాగవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

