Healthhealth tips in telugu

1 సారి రాస్తే…10 ఏళ్ల నాటి మోకాళ్ళ నొప్పులు,కీళ్ల నొప్పులు అన్నీ ఒక్క రాత్రిలో మాయం

Chamomile Oil Benefits : మారిన జీవనశైలి పరిస్థితులు,శారీరక శ్రమ చాలా తక్కువగా ఉండటం,ఎక్కువసేపు కూర్చొని ఉండటం వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలా మంది చాలా చిన్న వయస్సులోనే కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,నడుము నొప్పి, కండరాల నొప్పులతో బాధపడుతున్నారు. ఈ నొప్పులు తగ్గాలంటే పెయిన్ కిల్లర్స్ వాడవలసిన అవసరం లేదు.
Joint pains in telugu
ఈ నొప్పులను తగ్గించటానికి చిట్టి చామంతి నూనె (Chamomile Oil ) చాలా బాగా సహాయపడుతుంది. ఇప్పటికే చిట్టి చామంతి టీ తాగితే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని పరిశోదనల్లో తేలింది. చిట్టి చామంతి నూనెను నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు సమృద్దిగా ఉండుట వలన చర్మం ఉపరితలం క్రింద లోతైన చర్మ పొరలలోకి చొచ్చుకుపోయి నొప్పులను తగ్గిస్తుంది.
Joint Pains
ఈ నూనెను అరోమాథెరపీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ నూనె ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ నూనె ఆయుర్వేదం షాప్ లో, Online stores లభ్యం అవుతుంది. ఈ నూనె 10 Ml ధర 450 నుంచి 500 రూపాయిల వరకు ఉంటుంది. 1 Ml చిట్టి చామంతి నూనెను 5 Ml కొబ్బరి నూనె లేదా ఆవనూనెలో కలిపి వాడవచ్చు.

ఈ నూనె నొప్పులను తగ్గించటమే కాకుండా చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉన్నప్పుడూ ఆ ప్రదేశంలో ఈ నూనెను రాసి మసాజ్ చేస్తే క్రమంగా సోరియాసిస్ తగ్గుతుంది. ఒత్తిడి,ఆందోళన ఉన్నప్పుడు ఈ నూనెను పీల్చితే మానసిక ప్రశాంతత కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.