MoviesTollywood news in telugu

జై చిరంజీవా మేనకోడలు గుర్తు ఉందా… ఆమె ఇప్పుడు ఎంత పెద్ద హీరోయిన్… తెలుసా?

jai chiranjeeva child artist shriya sharma: నాగార్జున ఆ మధ్య నిర్మించిన నిర్మలా కాన్వెంట్ చిత్రం గుర్తుంది కదా. అందులో హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా పెట్టి తీసిన ఈ మూవీలో హీరోయిన్ గా వేసింది. ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్ శ్రేయ శర్మ. గతంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన జై చిరంజీవ మూవీలో చిరు మేనకోడలిగా నటించిన ఈ అమ్మడు ఇప్పుడు పెద్దదై, కుర్రకారు మతిపోగొట్టడానికి వడివడిగా వస్తోంది. ఇంతకీ ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటంటే, ఈమెది హిమాచల్ ప్రదేశ్ లో పాలంపూర్ ప్రాంతం.
jai chiranjeeva child artist
బ్రాహ్మణ కుటుంబంలో 1997సెప్టెంబర్ 9న ఇంజనీర్ వికాస్ శర్మ,రీతూ దంపతులకు జన్మించింది. తల్లి రీతూ పోషకాహార నిపుణురాలు. ఓ తమ్ముడు కూడా గల శ్రీయశర్మ సిమ్లాలో పదవతరగతి వరకూ చదువుకుని 91%మార్కులతో పాసయ్యింది. అలాగే సీబీఎస్ ఈ సిలబస్ లో ఢిల్లీలో చదివి అక్కడ కూడా 91% మార్కులు తెచ్చుకుంది.

ప్రస్తుతం ముంబయి యూనివర్సిటీలో డిగ్రీ చేస్తోంది. చదువులో ఫస్టు గా రాణిస్తూ సినిమాలంటే పిచ్చి గల శ్రేయ శర్మ వీలుచిక్కితే చాలు సినిమాల్లో నటిస్తూ స్టడీ సాగిస్తోంది. 2001లో చిన్నపాపగా ఉండగానే సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది. ఇక టాలీవుడ్ లో 2005లో వచ్చిన జై చిరంజీవ మూవీలో చిరంజీవి మేనకోడలిగా అద్భుత నటనతో అందరినీ అలరించింది.

తన చిట్టి పొట్టి మాటలతో ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఈమె ఇప్పటికే తెలుగు హిందీ, తమిళం, కన్నడం తో సహా అన్ని భాషల్లో దాదాపు 16సినిమాల్లో నటించింది. రోబో , దూకుడు, రచ్చ,తూనీగా తూనీగా , ఏటో వెళ్ళిపోయింది మనసు, గాయకుడు తదితర తెలుగు చిత్రాల్లో బాలనటిగా నటించి, అందరినీ మెప్పించింది.

బాలనటిగా కాకపోయినా హీరోయిన్ గా మాత్రం శ్రేయాశర్మ ఎంట్రీ ఇచ్చిన సినిమా మాత్రం తెలుగు సినిమాయే. 2016లో నాగార్జున నిర్మించిన నిర్మలా కాన్వెంట్ మూవీలో రోషన్ పక్కన హీరోయిన్ గా తొలిసారి నటించింది. ఈమె ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. 2011లో జాతీయ ఉత్తమ చైల్డ్ ఆర్టిస్ట్ గా అవార్డు సాధించింది.

2004లో కోషికి జిందగీ సినిమాకు పరివార్ పురస్కారం అందుకుంది. అదే ఏడాది ఉత్తమ బాలనటిగా ఇండియన్ టెలివిజన్ పురస్కారం అందుకుంది. ఇలా ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతంచేసుకుంటూ అద్భుత నటనతో శ్రేయాశర్మ ఇప్పుడు పెరిగి పెద్దదైంది. భవిష్యత్తులో స్టార్ హీరోయిన్ గా కుర్రకారుని ఊపేస్తుందని అంటున్నారు.