Healthhealth tips in telugu

ఈ దోశ తింటే చాలు రక్తహీనత ,కీళ్ల నొప్పులు,అధిక బరువు,డయాబెటిస్, కొలెస్ట్రాల్ అనేవి అసలు ఉండవు

Ragi Dosa Benefits : రాగులలో ఎన్నో పోషకాలు,ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో మూడు సార్లు రాగులను ఆహారంలో బాగంగా చేసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. రాగి పిండితో దోశ వేసుకొని తినవచ్చు. రాగి దోశ ఎలా తయారుచేయాలో చూద్దాం. ఒక గిన్నెలో ఒక కప్పు రాగి పిండి,ఒక కప్పు బియ్యం పిండి,అరకప్పు బొంబాయి రవ్వ వేయాలి,
finger millet In Telugu
ఆ తర్వాత చిన్న ఉల్లిపాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి, అంగుళం అల్లం ముక్కను ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ జీలకర్ర,సరిపడా ఉప్పు, కొత్తిమీర, అరకప్పు పెరుగు, సరిపడా నీటిని పోసి దోశల పిండి మాదిరిగా కలుపుకొని అరగంట అలా వదిలేసి ఆ తర్వాత దోశలు వేసుకోవాలి.
Is Ragi Good for Diabetes
ఇలా దోశలను వేసుకొని వారంలో రెండు లేదా మూడు సార్లు తింటే ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా రక్తహీనత ఉన్నవారికి రక్తంలో హీమోగ్లోబిన్ శాతాన్ని పెంచి రక్తహీనత సమస్య నుండి బయట పడేస్తుంది. అలాగే కీళ్లనొప్పులు,మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి కూడా చాలా మేలును చేస్తుంది.
Diabetes diet in telugu
డయాబెటిస్,అధిక బరువు, కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారిలో కూడా ఆ సమస్యలను తగ్గించటానికి సహాయపడుతుంది. రాగి పిండి మార్కెట్ లో లభ్యం అవుతుంది. లేదా రాగులను తెచ్చుకొని పిండిగా తయారుచేసుకోవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.