MoviesTollywood news in telugu

వైదేహి పరిణయం సీరియల్ యాక్టర్ దేవాన్ష్ రియల్ లైఫ్..అసలు నమ్మలేరు

Vaidehi parinayam serial Hero devansh : Zee Telugu ఛానల్ లో ప్రసారం అవుతున్న వైదేహి పరిణయం సీరియల్ బుల్లితెర ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. నటీనటులు తమ నటనతో ఆడియన్స్ లో క్రేజ్ పెంచారు. ఇక ఇందులో హీరోగా చేస్తున్న దేవాన్ష్ విషయానికి వస్తే,ఇతడి అసలు పేరు పవన్ రవీంద్ర. చిన్నప్పటి నుంచి నటన పట్ల ఆసక్తి గల యితడు మోడలింగ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసాడు.
Vaidehi parinayam serial actor devansh
తెలుగు ఆడియన్స్ కి మౌనరాగం సీరియల్ ద్వారా అనురాగ్ పాత్ర ద్వారా దగ్గరయిన పవన్ రవీంద్ర కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో రవీంద్ర,మేరీ ఆంటోని దంపతులకు జూన్ 3న జన్మించాడు. పవన్ కి ఓ సిస్టర్ ఉంది. ఇతడి చదువు అంతా కర్ణాటకలోని సాగింది. పలు ఫ్యాషన్స్ షోలలో పాల్గొని క్యాట్ వాక్ చేసిన యితడు కన్నడ సీరియల్స్ ద్వారా బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చాడు.
vaidehi parinayam serial
జానకీ రాఘవ అనే సీరియల్ తో కన్నడ బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన పవన్ రవీంద్ర తర్వాత రంగనాయకి సీరియల్ ద్వారా కన్నడ ఆడియన్స్ మనసులో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకున్నాడు. మౌనరాగంతో తెలుగు బుల్లితెరకు ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్లులేని పాత్రలో నటించి తొలిసిరియల్ తోనే ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. కన్నడలో కావ్యంజలి,తెలుగులో వైదేహి పరిణయం సీరియల్స్ లో నటిస్తూ నటుడిగా తనకంటూ ఓ ఇమేజ్ కొనసాగిస్తున్నాడు.