గీతాంజలి సినిమాలో హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్పిన నటి ఎవరో తెలుసా..
Nagarjuna Geethanjali Movie:మణిరత్నం దర్శకత్వంలో నాగార్జున హీరోగా, గిరిజ హీరోయిన్ గా నటించిన గీతాంజలి సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు సంగీతాన్ని ఇళయరాజా అందించారు. గీతాంజలి సినిమాకు సంగీతం హైలెట్ అని చెప్పవచ్చు.

ఈ సినిమా ఆరు నంది అవార్డులను గెలుచుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అయితే గీతాంజలి సినిమాలో హీరోయిన్ గిరిజకు డబ్బింగ్ చెప్పిన నటి ఎవరూ తెలుసా… ఆ నటి ఎవరో కాదు రోహిణి. రోహిణి బాలనటిగా సినీ పరిశ్రమకు వచ్చి హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసిన ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించారు.

రోహిణి ప్రస్తుతం సినిమాలతో చాలా బిజీగా ఉన్నది. రోహిణి చాలామంది హీరోయిన్స్ కు డబ్బింగ్ చెప్పారు. రోహిణి భర్త ప్రముఖ నటుడు రఘువరన్. ప్రస్తుతం రోహిణి అమ్మ,అత్త పాత్రలతో చాలా బిజీగా ఉన్నది.

