మటన్,చికెన్ కి బదులుగా 10 రూపాయిల ఖర్చుతో వీటిని తింటే కొండంత బలం వస్తుంది
Healthy foods that boost energy : నీరసం తగ్గించుకోవాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. మనలో చాలామంది బలమైన ఆహారం అంటే మాంసం, గుడ్లు, చేపలు అని భావిస్తారు. కానీ వాటికి బదులుగా తక్కువ ఖర్చులో వీటి కంటే ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహారాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.
మాంసాహారాలు బలాన్ని ఇస్తాయి. కానీ వాటిని జీర్ణం చేసుకోవడానికి వాటిలో సగం శక్తి సరిపోతుంది. మాంసాహారాలతో పోలిస్తే వాటి కంటే నాలుగు రెట్లు తక్కువ రేటు నాలుగు వంతులు ఎక్కువ శక్తినిచ్చే ఆహారాల గురించి తెలుసుకుందాం.మొదటిగా వేరుశెనగలు. ఇవి దాదాపుగా సంవత్సరం పొడవునా లభిస్తాయి. చాలా తక్కువ ఖర్చు ఎక్కువ శక్తిని అందిస్తాయి.
వీటిని వేగించుకొని లేదా నానబెట్టి లేదా ఉడికించి తినవచ్చు. మాంసాహారం కంటే 5 రెట్లు ఎక్కువ శక్తిని అందిస్తాయి.పచ్చికొబ్బరి కూడా మనకు సంవత్సరం పొడవునా విరివిగానే లభిస్తుంది. తక్కువ ఖర్చులో ఎక్కువ శక్తినిచ్చే ఆహారాలలో ఒకటి. వేరుశెనగ, కొబ్బరి ఈ రెండింటిలోనూ మన శరీరానికి అవసరమైన పోషకాలు అన్ని ఉంటాయి. పుచ్చ పప్పు కూడా మాంసం కంటే ఆరు రెట్లు ఎక్కువ శక్తిని అందిస్తుంది. .
మనకు తక్కువ ధరలో చాలా విరివిగానే దొరుకుతుంది. ఒక స్పూన్ పప్పును నీటిలో నానబెట్టి తీసుకోవచ్చు. సన్ ఫ్లవర్ గింజలు కూడా మాంసం కంటే 5 రెట్లు ఎక్కువ శక్తినిస్తాయి. వీటిని కూడా నీటిలో నానబెట్టుకుని తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది. గుమ్మడి గింజలు., జనపనార విత్తనాలు కూడా చాలా తక్కువ ఖర్చులో మనకు ఎక్కువ శక్తిని అందిస్తాయి.
మనలో చాలామంది వీటిని విస్మరిస్తారు కానీ వీటిని మనం రెగ్యులర్ గా తీసుకొంటూ ఉంటే అలసట, నీరసం వంటివి లేకుండా ఉత్సాహంగా ఉంటాం. అలాగే మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు కూడా సమృద్ధిగా అందుతుంది. కాబట్టి ఉదయం సమయంలో నానబెట్టిన వేరుశనగ,కొబ్బరి తీసుకుంటే సాయంత్రం సమయంలో గింజలను నానబెట్టి తింటే సరిపోతుంది.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.