Healthhealth tips in telugu

పరగడుపున నిమ్మ రసాన్ని త్రాగుతున్నారా …. ఈ 5 నిజాలు తెలుసుకోకపోతే….???

Lemon Juice Health benefits In telugu:పసుపు రంగులో ఉండి రుచికి పుల్లగా ఉండే నిమ్మకాయలో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. నిమ్మ మొక్కలను నిమ్మరసం కోసం పెంచుతారు. నిమ్మచెట్టు పొట్టిగా దట్టంగా ఉండి 10 అడుగుల ఎత్తు పెరుగుతుంది. కొమ్మలు ముళ్ళతో ఉంటాయి. నిమ్మకాయ అతి తక్కువ ధరలో అందరికి అందుబాటులో ఉండే ఒక చవకైన ఆరోగ్యకరమైన వస్తువు.
lemon benefits
దీనిలో ఉన్న ప్రయోజనాలు అపారం. ఒక విధంగా చెప్పాలంటే నిమ్మకాయ శరీరంలో ప్రతి భాగానికి ఉపయోగపడుతుంది. అంటే మన శరీరానికి ఎంతలా ఉపయోగపడుతుందో అర్ధం చేసుకోవచ్చు. నిమ్మకాయలో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. ఈ అన్ని ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మీరు తప్పనిసరిగా నిమ్మకాయ వాడకాన్ని పెంచుతారు.

వికారం,వాంతులు తలనొప్పి ఉన్నప్పుడు పండిన పసుపు రంగులో ఉన్న నిమ్మకాయను వాసన చుస్తే వాంతులు,వికారం,తలనొప్పి తగ్గుతాయి. నిమ్మరసంను ఎంతో ప్రాచీనమైన సాంప్రదాయక డ్రింక్ గా చెప్పవచ్చు. కొంతమందికి చింతపండు పడదు. అటువంటి వారు చింతపండుకి ప్రత్యామ్న్యాయంగా నిమ్మరసాన్ని వాడతారు.

నిమ్మకాయలో విటమిన్ సితో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. అటువంటి నిమ్మరసం మనకు ఎన్ని రకాలుగా సహాయపడుతుందో వివరంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో మారిన జీవనశైలి పరిస్థితుల కారణంగా చాలా మందిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం అనేది సర్వసాధారణం అయ్యిపోయింది.

నీటిని తక్కువగా త్రాగటం మరియు శరీరంలో క్యాల్షియం నిల్వలు ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి.నిమ్మరసం త్రాగితే శరీరంలో అధికంగా ఉన్న క్యాల్షియంను తొలగించటంలో సహాయాపడుతుంది. అలాగే కిడ్నీలో రాళ్లను కూడా కరిగిస్తుంది. నిమ్మలో ఉండే రుటిన్ కంటి రెటీనా సమస్యలను తగ్గిస్తుంది. అలాగే కంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది.

మన శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ మరియు ఫ్రీ రాడికల్స్ ని తొలగించే లక్షణాలు నిమ్మలో సమృద్ధిగా ఉన్నాయి. నిమ్మరసం త్రాగితే అజీర్ణం వలన ఏర్పడే, గుండెమంట, కడుపు ఉబ్బటం, త్రేన్పులు వంటి జీర్ణ సమస్యలు అన్ని తొలగిపోతాయి. నిమ్మలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ పెద్ద పేగుకు క్యాన్సర్ కు దారితీసే బ్యాక్టీరియాతో పోరాడుతుంది. దీనిలోని కొన్ని పదార్ధాలు కేన్సర్ రాకుండా నిరోధిస్తాయి. అంతే కాదు కడుపులో నులిపురుగులు ఏర్పడకుండా సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.