MoviesTollywood news in telugu

Allu Arjun రిజెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని సూపర్ హిట్ అయ్యాయో చూడండి

Allu Arjun rejected Movies : అల్లు అర్జున్ తన ప్రతి సినిమాలోనూ ప్రత్యేకత ఉండేలా చూసుకుంటాడు. అలాగే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అల్లు arjun డాన్స్ అంటే ఇష్టపడతారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప అనే బ్లాక్‌బస్టర్‌ మూవీతో ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో తన సత్తాను మరోసారి ఇండస్ట్రీకి చూపించాడు.

అయితే బన్నీ కెరీర్‌లో హిట్‌లతో పాటు ఫ్లాపులు కూడా ఉన్నాయి.కానీ తన కెరీర్‌లో ఎన్ని హిట్ సినిమాలు వదులుకున్నాడో తెలిస్తే మాత్రం మీరు ఖచ్చితంగా నోరెళ్లబెడతారు. బన్నీ తొలిచిత్రం గంగోత్రి సమయంలో దర్శకుడు తేజ ఆయనకు జయం కథ వినిపించాడు. కానీ గంగోత్రి రిలీజ్ సమయం కావడంతో జయం సినిమాను పెద్దగా పట్టించుకోలేదు.

దీంతో నితిన్ ఆ ఛాన్స్ కొట్టేసి అదిరిపోయే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో భద్ర సినిమాను కూడా బన్నీ చేయాల్సి ఉంది.
కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా రవితేజకు వెళ్లడం సూపర్ హిట్‌గా నిలవడం జరిగింది. అటుపై సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన 100% లవ్ కూడా బన్నీ చేయాల్సి ఉంది. కానీ ఆ సినిమా నాగ చైతన్యకు వెళ్లింది.

గోపిచంద్ మలినేని డైరెక్షన్‌లో ‘పండగ చేస్కో’ సినిమా కూడా బన్నీకే తొలి అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా యంగ్ హీరో రామ్ ఎగరేసుకుపోయాడు.ఆ తరువాత ఒక లైలా కోసం, అర్జున్ రెడ్డి, గ్యాంగ్ లీడర్, డిస్కో రాజా, గీతా గోవిందం, అరవింద సమేత వంటి సినిమాలు కూడా తొలుత బన్నీయే చేయాల్సినవి. కానీ వాటిని బన్నీ పలు కారణాలతో వదులుకున్నాడు.

ఇలా పలు బ్లాక్‌బస్టర్ సినిమాలను బన్నీ వదులుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు.కానీ ప్రస్తుతం టాప్ స్టార్స్‌లో ఒకడిగా బన్నీ ఉండటం వారికి సంతోషాన్ని కలిగిస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."