Healthhealth tips in telugu

ఈ డ్రింక్ శరీరంలో వేడిని తగ్గించటమే కాక అధిక బరువు,శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది

Summer Drink : వేసవికాలంలో ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఈ ఎండలకు తట్టుకోలేక చాలా మంది ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగేస్తూ ఉంటారు. అలా కాకుండా మనం ఇంటిలో డ్రింక్ తయారుచేసుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరంలో వేడిని తగ్గించటమే కాకుండా అధిక బరువును, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఒక స్పూన్ సబ్జా గింజలను నీటిలో రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో ఒక స్పూన్ సొంపు,3 స్పూన్ల బెల్లం,2 యాలకులు, 7 మిరియాలు వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఎక్కువ మొత్తంలో చేసుకొని నిల్వ చేసుకోవచ్చు. ఒక గ్లాస్ చల్లని నీటిలో ఒక స్పూన్ పొడి, నానబెట్టి ఉంచుకున్న సబ్జా గింజలను వేసి బాగా కలిపి తాగాలి.
sompu
రోజులో ఒకసారి తీసుకుంటే సరిపోతుంది. శరీరంలో వేడి తగ్గటమే కాకుండా శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. ఎండలోకి వెళ్ళి ఇంటిలోకి వచ్చిన వెంటనే ఒక గ్లాస్ డ్రింక్ తాగితే వడదెబ్బ,అలసట,నీరసం,తలనొప్పి వంటివి లేకుండా ప్రశాంతగా ఉంటారు. శరీరం రీఫ్రెష్ అవుతుంది.

ఈ ఎండాకాలంలో కూల్ డ్రింక్ ల జోలికి వెళ్లకుండా ఇటువంటి పోషకాలు ఉన్న డ్రింక్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ వేసవిలో మన శరీరానికి ఈ డ్రింక్ అన్నీ రకాలుగా సహాయపడుతుంది. ఈ డ్రింక్ చేసుకోవటం చాలా సులువు.కాస్త ఓపిక,సమయాన్ని కేటాయిస్తే సరిపోతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."