గుప్పెడంత మనస్సు సీరియల్ కొత్త విలన్ గురించి తెలుసా…?
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనస్సు సీరియల్ ఎంతటి ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీరియల్ లో కొత్త పాత్ర ఎంటర్ అయింది. ఈ పాత్రలో ఫేమస్ బుల్లితెర నటుడు నటిస్తున్నాడు. మెడికల్ కాలేజ్ స్థాపించి సమాజానికి సేవ చేయాలనీ ఆలోచనలో ఉన్న rishi ఆలోచనలను దెబ్బతీసే విలన్ పాత్ర ఎంటర్ అయింది.

ఆ పాత్రలో ప్రముఖ నటుడు రామ్ జగన్ నటిస్తున్నారు. రామ్ జగన్ ఎన్నో సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ లో కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. గతంలో కళ్యాణ వైభోగం, రంగుల రాట్నం వంటి ఎన్నో సీరియల్స్ లో నటించారు.

గుప్పెడంత మనస్సు సీరియల్ లో సోజన్య రావు పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్ లో రిషి వాళ్ళు ప్రారంభించే మెడికల్ కాలేజ్ లో పార్టనర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సీరియల్ లో నెగిటివ్ పాత్రలో నటిస్తున్నాడు. రాబోయే రోజుల్లో ఎన్ని సమస్యలను క్రియేట్ చేస్తాడో చూడాలి.

