MoviesTollywood news in telugu

చిరంజీవిని 24 సార్లు చెంప దెబ్బ కొట్టిన హీరోయిన్ ఎవరో తెలుసా?

Chiranjeevi And Radhika : చిరంజీవి గురించి ఏ విషయం తెలుసుకోవటానికి అయినా అభిమానులు ముందు ఉంటారు. చిరంజీవికి తనతో నటించిన అత్యంత ఇష్టమైన హీరోయిన్లలో రాధిక ఒకరు. 40 ఏళ్ల క్రితం మొదలైన వారి పరిచయం ఇప్పటికీ బలంగానే కొనసాగుతుంది. ఈ విషయం పలు సందర్భాల్లో వ్యక్తమైంది. అయితే ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని, వారి మధ్య జరిగిన తమాషా సంఘటనలు పంచుకున్నారు. ఆ విషయాలను రాధికా మనతో పంచుకుంటూ…. చిరంజీవితో నా కెరీర్ మొదలైంది.
chiranjeevi
న్యాయం కావాలి అనే నా తొలితెలుగు సినిమా హీరో ఆయనే. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించాం. మా కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ హిట్ అయ్యాయి. న్యాయం కావాలి షూటింగ్ లో కలసిన మొదటిరోజు నుంచే మా మధ్య మంచి కెమిస్ట్రీ ఏర్పడింది. అప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్ అయ్యాము. మా మధ్య అన్యోన్యతను చూసి అనేక రూమర్స్ వచ్చాయి. కానీ, అటువంటి బంధం మా మధ్య లేదు. న్యాయం కావాలి సినిమా కథలో భాగంగా చిరంజీవిని చెంపపై కొట్టాలి.

ఆ సీన్ సరిగ్గా చేయలేకపోయాను. ఆ సీన్ లో 24 టెక్స్ తీసుకున్నాను. అంటే చిరంజీవిని 24 సార్లు చెంపదెబ్బ కొట్టాను. దాంతో అయన చెంప బాగా కందిపోయింది. చెంప ఎర్రగా ఉబ్బిపోయింది. దాంతో నేను వెళ్లి ఆయనకు సారీ చెప్పాను .ఆ అందుకు పరవాలేదు అమ్మా… నా చెంపను బాగానే వాయించవమ్మా అంటూ నవ్వారు అని సరదా సంఘటనను చెప్పింది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."