ఈ టాప్ యాంకర్స్ అసలు వయస్సు ఎంతో తెలుసా..
Tollywood anchors real age :బుల్లితెర రంగం విస్తృతమయ్యే కొద్దీ యాంకర్లు పెరుగుతున్నారు. అలా తొలినాళ్ళ నుంచి తెలుగు టెలివిజన్ రంగంలోకి చాలా మంది యాంకర్స్ వస్తున్నా, అందులో కొందరే స్టార్ యాంకర్స్ పాపులర్ అవుతున్నారు. సుమ కనకాల , అనసూయ, రష్మి గౌతమ్, ఝాన్సీ, రోజా, శ్యామల, శ్రీ ముఖి లు వంటి ఫీమేల్ యాంకర్స్ బాగా పాపులరయ్యారు. వేళల్లో మొదటగా ప్రస్తావించాలంటే, సుమ కనకాల గురించే. ఎందుకంటే, రెండున్నర దశాబ్దాలు అవుతున్నా, ఇంకా తన టాలెంట్ తో టీవీ షో లు, సినిమా ఆడియో ఫంక్షన్స్ లో దూసుకుపోతోంది.
కేరళలో 1975 మార్చి 25 న పుట్టిన సుమ ప్రస్తుత వయసు 48 సంవత్సరాలు. అయినా ఈమె క్రెజ్ మాత్రం ఏమాత్రం వెనకబడలేదు. హీరోయిన్ రోజా ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి ఎన్నో టివి షోస్ చేసింది. ఇప్పుడు ఓ పక్క రాజకీయాలు, మరో పక్క జబర్దస్త్ లాంటి టీవీ షో లతో బిజీ అయిపొయిన రోజా 1972 నవంబర్ 17 పుట్టింది.సో .. ఈమె వయసు 50 సంవత్సరాలు.
ముందుతరం యాంకర్స్ లో ఒకరైన ఝాన్సీ దశాబ్దం పాటు యాంకర్ గా, సినిమా ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని సాగిస్తోంది. 1975 మార్చి 7న పుట్టింది. 48 సంవత్సరాలు వచ్చినా సరే, ఇప్పటికీ ఝాన్సీ అడపాదడపా యాంకరింగ్ చేస్తూనే ఉండడం విశేషం. ఇక ఉదయభాను పదవ తరగతి చదివేటప్పుడు 1990 లో ఆర్ నారాయణ మూర్తి సినిమాలో కూతురిగా నటించింది. ఆ తర్వాత యాంకరింగ్ రంగంలోకి వచ్చింది. కొన్ని సినిమాలలో ఐటెమ్ సాంగ్స్ లో కూడా మెరిసింది.
1973 ఆగష్టు 4న జన్మించిన ఆమె వయసు ఇప్పుడు 50 సంలు. ఇక ప్రస్తుతం ట్రేండింగ్ లో ఉన్న యాంకర్ అనసూయ జబర్దస్త్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి, యమరేంజ్ లో క్రేజ్ తెచ్చుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నాకూడా ఇప్పటికి అమ్మాయిలాగనే సెక్సీ లుక్స్ తో ఉండే అనసూయ 1985 మే 15 న జన్మించింది. 38 సంవత్సరాల వయస్సులో కూడా తన సత్తా చాటుతోంది.
యాంకర్ శ్యామల యాంకరింగ్ రంగంలో, సినిమా రంగంలో కూడా చేస్తోంది. 1989 నవంబర్ 5న పుట్టిన ఈమె వయసు 34 సంవత్సరాలు. యాంకర్స్ అందరికీ భిన్నంగా ఉంటూ, చీర, లంగా వోణి లతో మాత్రమే కనిపిస్తుంది. అందుకే తక్కువ సమయంలో యాంకర్ గా నిలదొక్కుకుంది. రష్మీ గౌతమ్ మొదటిలో సినిమాల్లో నటించినా, పెద్దగా గుర్తింపు రాలేదు.
అయితే జబర్దస్త్ షో లో యాంకర్ గా చేసాక రష్మి జీవితమే మారిపోయింది. 1988 ఏప్రిల్ 7న పుట్టిన ఈమె వయస్సు 35 సంవత్సరాలు. పటాస్ షో తో బాగా పాపులరయిన యాంకర్ శ్రీముఖి యాంకరింగ్ చేయడంలో దిట్ట. ఇప్పుడున్న యాంకర్స్ లో తక్కువ వయసు గల శ్రీముఖి ఒకటి. 1993 మే 10న పుట్టిన శ్రీముఖి వయసు 30 సంవత్సరాలు.