కిడ్నీలో రాళ్ళు, కిడ్నీ సమస్యలను తగ్గించే అద్భుతమైన శక్తి ఉన్న ఆహారాలు…అసలు నమ్మలేరు
Best Foods For Kidneys : కిడ్నీలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. 24 గంటలు కూడా విరామం లేకుండా పని చేస్తూనే ఉంటాయి. అవి శరీరంలోని విష పదార్థాలను మూత్రం ద్వారా బయటకు పంపుతాయి. అందువల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరంలోని ఇతర అవయవాలు కూడా సక్రమంగా పనిచేస్తాయి.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి మంచి పోషకాలు ఉన్న ఆహారం…కిడ్నీల ఆరోగ్యానికి సహాయపడే ఆహారాలను తీసుకుంటూ ఉండాలి. కాలీఫ్లవర్‌లో విటమిన్ సి, విటమిన్ కె, ఫైబర్ కంటెంట్, ఫోలిక్ యాసిడ్ మరియు పొటాషియం సమృద్దిగా ఉండటం వలన కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాలీఫ్లవర్ లో ఉండే థియోసైనేట్స్ మరియు గ్లూకోసినోలేట్ అనేవి సమృద్దిగా ఉంటాయి.
ఇవి శరీరంలో పేరుకుపోయిన, అనవసర వ్యర్థాలను తొలగించడమే కాకుండా శరీరంలోని అంతర్గత అవయవాల ఆరోగ్యాన్ని కాపాడతాయి. కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు, కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్యను కూడా తగ్గిస్తుంది. వారంలో రెండు సార్లు కాలీఫ్లవర్ ని ఆహారంలో బాగంగా చేసుకుంటే మంచిది.
క్యారెట్ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ సమృద్దిగా ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా రక్తపోటు సమస్యలను కూడా నియంత్రిస్తుంది. ఇది శరీరంలో సోడియం కంటెంట్ తక్కువగా ఉండటమే కాకుండా, శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది మరియు మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. వారంలో రెండు సార్లు క్యారెట్ తీసుకుంటే మంచిది.
జామకాయలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల శరీరంలో పేరుకుపోయిన అదనపు సోడియంను తొలగించి రక్తపోటు సమస్య నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరంలో సోడియం కంటెంట్ పెరిగితే భవిష్యత్తులో కిడ్నీ సమస్యలు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఈ పండును మితంగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.