తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే ఈ పప్పులో ఉన్న ఆ రహస్యం తెలిస్తే…అసలు వదిలిపెట్టరు
Vaypudu Senagapappu Benefits in telugu :ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ప్రోటీన్ సమృద్దిగా ఉన్న ఆహారాలను తీసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనలో చాలా మంది ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారు.ఇప్పుడు చెప్పే ఈ పప్పును మనం రెగ్యులర్ గా ఉపయోగిస్తూ ఉంటాం. ఈ పప్పును పుట్నాల పప్పు లేదా వేపుడు శనగపప్పు అని పిలుస్తాం. ఈ పప్పుతో చెట్నీ,పచ్చడి, పోడాలను తయారుచేసుకుంటూ ఉంటాం. ఈ వేపుడు శనగపప్పుని తింటే గ్యాస్ వస్తుందని చాలామంది తినటానికి ఇష్టపడరు.

అయితే ఈ వేపుడు శనగపప్పు అనేది సామాన్యునికి ఒక బలమైన ఆహారం. తక్కువ ఖర్చులో ఎక్కువ ప్రోటీన్ అందించే ఈ పప్పును రెగ్యులర్ గా తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ పప్పులో ప్రోటీన్ సమృద్దిగా ఉంటుంది. మాంసాహారానికి దూరంగా ఉండేవారికి మంచి ఎంపిక అని చెప్పవచ్చు. వారంలో ఈ పప్పును రెండు లేదా మూడు సార్లు తీసుకోవచ్చు.

ఇతర పప్పు దినుసులతో పోలిస్తే.. దీనిలో ఎక్కువ మోతాదులో ప్రొటీన్లు ఉంటాయి. అలాగే అమైనో ఆమ్లాలు కూడా సమృద్దిగా ఉంటాయి. బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. ఇందులో పీచు పదార్థం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే శనగపప్పులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి.

డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇది నెమ్మదిగా జీర్ణమవడం వల్ల.. శరీరంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనిలో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుంటుంది.

అలాగే పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. వేపుడు శనగ పప్పులో ఉండే మెగ్నీషియం, పొటాషియం వంటివి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచి అధిక రక్తపోటును తగ్గిస్తాయి. వేపుడు శనగపప్పులోని పీచు పదార్థం రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.ఈ పప్పులో ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం ఉండుట వలన ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

