నువ్వు నేను ప్రేమ సీరియల్ పద్మావతి గురించి ఈ విషయాలు తెలుసా…?
Nuvvu Nenu Prema serial Padmavathi:నువ్వు నేను ప్రేమ సీరియల్ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకొని సక్సెస్ గా ముందుకు సాగుతుంది. ఈ సీరియల్ లో నటించే నటీనటులకు ఎంతో మంచి పేరును తెచ్చిపెట్టటమే కాకుండా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ సీరియల్ లో పద్మావతి పాత్రలో Pavitra Naik నటిస్తుంది.
బెంగుళూర్ లో పుట్టి పెరిగిన Pavitra ఇంజనీరింగ్ పూర్తి చేసింది. చిన్నతనం నుండి నటన మీద ఆసక్తి ఉండటంతో చదువు పూర్తి కాగానే యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయింది. ఆ తర్వాత కన్నడ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. Pavitra కన్నడలో నాలుగు సినిమాలు, మూడు సీరియల్స్ లో నటించింది. Pavitra కు కన్నడలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Pavitra సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ అభిమానులకు అందుబాటులో ఉంటుంది. nuvvu నేను ప్రేమ సీరియల్ లో తన నటనతో తెలుగులో కూడా చాలా మంది అభిమానులను సంపాదించింది.