MoviesTollywood news in telugu

చిరంజీవి సినిమా 60% షూటింగ్ కంప్లీట్ అయ్యాక ఎందుకు ఆగిపోయిందో అసలు రహస్యం ఇది..

Chiranjeevi Movie:తెలుగు తెరపై దాదాపుగా 40 సంవత్సరాల పాటు అలరించిన స్టార్ చిరంజీవి . చిరంజీవి తగిన పాత్రలతో అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు. చిరు కొడుకు రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చిన హీరోగా కొనసాగుతున్నాడు. చిరంజీవి కెరీర్ టాప్ రేంజ్ లో ఉన్నప్పుడు ఒక సినిమా మొదలు పెట్టి ఆపేసాడంటే ఆశ్చర్యం కలగక మానదు. చిరంజీవి మాస్టర్ సినిమా తర్వాత అంటే 1998 తర్వాత భారీగా హాలీవుడ్ సినిమాను ప్లాన్ చేసారు. అప్పట్లోనే 50 కోట్ల బడ్జెట్ తో తీద్దామని అనుకున్నారు. ఈ సినిమాను హాలీవుడ్ మరియు తెలుగులో తీద్దామని ప్లాన్ చేసారు . తెలుగులో సురేష్ కృష్ణ దర్శకత్వం వహించేందుకు రంగం సిద్ధం అయింది.

రాజుల కాలం నాటి కోటల కోసం ఉదయ్ పూర్,జోద్ పూర్ తో పాటు గోల్గొండ కోటలు వంటి ప్రాంతాలలో షూటింగ్ చేసారు. అయితే ఈ క్రమంలోనే ఒక చిక్కు వచ్చింది. బాగ్దాద్ గజదొంగ అంటే అందరికి తెలిసిందే.

ఇందులో హీరో ముస్లిం. కధానుసారంగా పాత ఖురాన్ గ్రంధంలో ఎదో చూపించి నిధి కోసం అన్వేషించే పాత్ర. ఇందులో భాగంగా ఖురాన్ గ్రంధంగా ఒక పుస్తకాన్ని చూపించటానికి ఆ పుస్తకాన్ని టీ పానీయంలో ముంచి ఆరబెట్టారు.

ఆలా అయితే పురాతన గ్రంధంగా కనిపిస్తుందని చిత్ర యూనిట్ భావించింది. అయితే ఈ విషయం బయటకు వచ్చేసరికి ఖురాన్ ప్రతులు తగలబెట్టారని ఒక అల్లరిమూక బయలుదేరి షూటింగ్ నిలిపేసింది. నిర్మాతలు హాలీవుడ్ వారు కావటంతో ఇలా షూటింగ్స్ కి బ్రేక్ పడటం నచ్చక వెళ్లిపోయారు. ఆలా చిరంజీవి హాలీవుడ్ కలకు బ్రేక్ పడింది.