Healthhealth tips in telugu

పావు స్పూన్ చాలు శరీరంలో గ్యాస్,అజీర్ణం,అసిడిటీ సమస్యలను మాయం చేస్తుంది

Ajwain Health Benefits In Telugu : మనలో చాలా మంది గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.గ్యాస్ సమస్య వచ్చింది అంటే ఒక పట్టాన తగ్గదు. ఈ సమస్య నుంచి బయట పడాలంటే కొన్ని ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడుతాయి. గ్యాస్ సమస్య వెంటనే తగ్గాలంటే వాము చాలా బాగా సహాయపడుతుంది
Ajwain Health Benefits In Telugu
వాము అనేది మన వంటింట్లో రెగ్యులర్ గా ఉపయోగించే దినుసు. వాము కాస్త ఘాటుగా ఉండటం వలన చాలామంది తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ గ్యాస్ సమస్యలు తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. గ్యాస్ సమస్య వచ్చినప్పుడు పావు స్పూన్ వాము తీసుకుని నోట్లో వేసుకుని నములుతూ ఆ రసాన్ని నిదానంగా మింగాలి.
gas troble home remedies
ఇలా చేయటం వలన గ్యాస్ నొప్పి నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఈ గింజలు గ్యాస్ట్రిక్ విడుదలను పెంచి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. అలాగే ఇంకో విధంగా కూడా తీసుకోవచ్చు ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని పోసి కాస్త వేడెక్కాక పావు స్పూన్ వాము వేసి మూడు నుంచి నాలుగు నిమిషాలు మరిగించాలి.
Vamu Water Benefits
ఈ మరిగిన నీటిని వాముతో సహా వేడిగా ఉన్నప్పుడే కాఫీ,టీ తాగిన మాదిరిగా తాగాలి. ఈ విధంగా తాగటం వల్ల గ్యాస్ తగ్గుతుంది. వాము గ్యాస్ సమస్య నుంచి బయటపడటానికి చాలా బాగా సహాయపడుతుంది అలాగే గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఉదయం సమయంలో పరగడుపున ఒక లీటర్ నీటిని తాగితే గ్యాస్ సమస్య నుంచి బయట పడవచ్చు.
Acidity home remedies
సాధ్యమైనంతవరకు మందుల జోలికి వెళ్లకుండా గ్యాస్ నివారణకు వాము, మంచి నీరు చాలా బాగా సహాయపడుతుంది. గ్యాస్ సమస్యను అసలు అశ్రద్ద చేయకూడదు. మన వంటింటిలో ఉండే వాము జీర్ణ సమస్యలకు బాగా పనిచేస్తుంది. మన వంటింటిలో ఉండే ఎన్నో దినుసులలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.