Healthhealth tips in telugu

1 గ్లాసు కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,తుంటి నొప్పి, కీళ్ల నొప్పి, మెడ నొప్పి తగ్గి కాల్షియం లోపం ఉండదు

Joint Pains Milk : ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,డయాబెటిస్ ఉన్నవారికి ఇప్పుడు చెప్పే జావ లేదా పాలు చాలా బాగా సహాయపడతాయి. సమస్యలు వచ్చినప్పుడు లేదా సమస్యలు రాకుండా ఉండాలంటే పోషకాలు ఉన్న ఆహారం తీసుకోవాలి. దీని కోసం పొయ్యి మీద మూకుడు పెట్టి ఒక కప్పు సగ్గుబియ్యం వేసి కొంచెం వేగాక ఒక కప్పు పొట్టు మినపప్పు వేసి వేగించాలి.

ఆ తర్వాత ఒక కప్పు తెల్ల నువ్వులు లేదా నల్ల నువ్వులు వేసి మంచి ఫ్లెవర్ వచ్చేవరకు వేగించి మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడి దాదాపుగా 15 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఒక స్పూన్ పొడిని ఒక కప్పులో వేసి నీటిని పోసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాస్ పాలను పోసి కొంచెం వేడి చేయాలి.

ఆ తర్వాత పిండిని నీటిలో కలిపిన మిశ్రమాన్ని పాలల్లో వేసి 5 నిమిషాల వరకు ఉడికించాలి. ఆ తర్వాత గ్లాస్ లో పోసి ఒక స్పూన్ బెల్లం పొడి వేసి బాగా కలపాలి. ఈ పాలను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. ఈ పాలను తీసుకోవటం వలన కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, రక్తహీనత,డయాబెటిస్ వంటి సమస్యలు ఉండవు.
Joint Pains
డయాబెటిస్ ఉన్నవారు బెల్లం లేకుండా తీసుకోవాలి. వేసవిలో వచ్చే అలసట,నీరసం వంటివి లేకుండా హుషారుగా ఉండేలా చేస్తుంది. వేసవిలో వచ్చే సమస్యలు, నార్మల్ గా వచ్చే అన్నీ రకాల సమస్యలు అన్నీ తగ్గుతాయి. ఈ మధ్య కాలంలో చాలా మంది కాల్షియం లోపంతో బాధపడుతున్నారు. వారికి ఈ పాలు అనేవి మంచి ఎంపిక అని చెప్పవచ్చు.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.