Healthhealth tips in telugu

అన్ని రకాల కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు తగ్గించి ఎముకలను ఉక్కులాగా మార్చే మొక్క

Nalleru benefits In Telugu : ప్రాచీన వైద్య విధానంలో ఎన్నో రకాల మొక్కలను ఉపయోగించి వైద్యం చేసేవారు. పల్లెటూర్లలో, పొలం గట్ల మీద రోడ్లకు ఇరువైపులా ఉండే ఒక మొక్క గురించి తెలుసుకుందాం. ఈ మొక్క విరిగిన ఎముకలను అతికిస్తుంది. ఆ మొక్క పేరు నల్లేరు. నల్లేరు మొక్క చూడటానికి పొడుగ్గా ములక్కాడల వల్లే అనిపిస్తుంది. ఎముకలను అతికిస్తుంది..
Joint pains in telugu
అలాగే రక్షిస్తుంది కాబట్టి అస్థి సంహరక అని కూడా పిలుస్తారు. ఈ మొక్క మీద పరిశోధకులు పరిశోధన చేశారు. ఎముకలకు బలాన్ని ఇవ్వటమే కాకుండా విరిగిన ఎముకలను అతికిస్తుంది అని తెలిసింది. నల్లేరు ఎముకల్లో దృఢత్వం పెంచటమే కాకుండా పక్కన ఉన్న కండరాలకు శక్తి నిస్తుంది.
అంతేకాకుండా నొప్పి నివారణ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆస్ప్రిన్ టాబ్లెట్ కు సమానంగా నివారణ గుణాలు ఉన్నాయి.
Joint Pains
నల్లేరు గుజ్జు ను ఎముకలు విరిగిన చోట రాసి దానిపైన దూది వేసి కట్టుకట్టాలి. ఇలా చేస్తూ ఉంటే విరిగిన ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. నల్లేరును మగ్గించి దంచి రసం తీయాలి. వీటి రసానికి సమాన మోతాదులో అవు నెయ్యి కలిపి నెయ్యి మాత్రమే మిగిలే వరకూ మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న ఈ నెయ్యిని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

ప్రతిరోజు ఉదయం, రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని ఆవుపాలలో ఒక స్పూన్ నెయ్యి కలిపి తీసుకుంటే ఎముకలు త్వరగా అతుక్కుంటాయి. నల్లేరు మొక్క లో కాల్షియం, బీటాకెరోటిన్, ఫ్లేవనాయిడ్స్, అస్బార్బిక్ ఆమ్లం, బీటా సిస్టో స్టరాల్, విటమిన్ సి, మాంగనీస్ పొటాషియం అధికంగా ఉంటాయి. దీనిని పచ్చడి, పులుసు, కూరగా వండుకొని తింటారు. నల్లేరును కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే దురద రాదు. నల్లేరు పొడి రూపంలో కూడా లభ్యం అవుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/