రాధమ్మ కూతురు సీరియల్ లేడి విలన్ గురించి ఈ విషయాలు తెలుసా…?

Radhamma Kuthuru Serial: ఈ మధ్యకాలంలో సినిమాల కంటే సీరియల్స్ చూసే వారి సంఖ్య చాలా ఎక్కువైంది. ఒకప్పుడు వీక్లీ సీరియల్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ప్రతిరోజు డైలీ సీరియల్ వస్తున్నాయి. ఒకప్పుడు సినిమాల్లో నటించిన నటులు ప్రస్తుతం బుల్లితెరలో సీరియల్స్ లో నటించి అభిమానులకు బాగా దగ్గరవుతున్నారు. ప్రస్తుతం వస్తున్న సీరియల్స్ లో లేడీ విలన్ లకు మంచి పాపులారిటీ ఉంది.

ప్రేమ ఎంత మధురం, రాధమ్మ కూతురు సీరియల్స్ లో విలన్ గా నటిస్తున్న మహేశ్వరి గురించి తెలుసుకుందాం. మహేశ్వరి కంటే శృతి గానే బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితం. ఎందుకంటే రాధమ్మ కూతురు సీరియల్ లో శృతి క్యారెక్టర్ లో బాగా చేరువయ్యింది. గుంటూరుకి చెందిన మహేశ్వరి నా కోడలు బంగారం సీరియల్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత రాధమ్మ కూతురు, ప్రేమ ఎంత మధురం సీరియల్స్ తో అభిమానులను ఆకట్టుకుంటుంది, దాదాపుగా ఐదు సంవత్సరాలు నుండి సీరియస్ తో బిజీగా ఉంది. నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ సమంత అంటే ఇష్టం. హుండై కారు, గుంటూరులో సొంతింట్లో ఉన్నా, హైదరాబాద్ మణికొండ అపార్ట్ మెంట్ లో 18వేలకు రెంట్ కి ఉంటోంది. సిరియల్స్ లో నటిస్తూ ఈ అమ్మడు బాగానే సంపాదిస్తుంది.