MoviesTollywood news in telugu

హీరో శర్వానంద్ సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవాడు …. బ్యాక్ గ్రౌండ్ ఏమిటో తెలుసా?

Tollywood Hero sharwanand:శతమానం భవతి వంటి హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న హీరో శర్వానంద్ సినిమా సినిమాకు తన నటనను మెరుగుపరుచుకుంటూ దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం దర్శకుడు సుధీర్ వర్మ తీస్తున్న షార్ వార్ 27లో చేస్తున్నాడు. శర్వానంద్ పుట్టినరోజు సందర్బంగా ఈ మూవీ పోస్టర్ విడుదల చేసారు. విజయవాడ లోని అమ్మగారి ఇంట 1984మార్చి6న జన్మించిన శర్వానంద్ కి ఓ అన్నయ్య కళ్యాణ్ ,అక్క రాధిక ఉన్నారు. తండ్రి ప్రసాదరావు వ్యాపార వేత్త. తల్లి వసుంధరాదేవి గృహిణి. బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివిన శర్వానంద్ కి చిన్ననాటి నుంచి సినీ మోజు ఉండేది.

పైగా రామ్ చరణ్ , రానా క్లాస్ మేట్స్ గా ఉండేవాళ్ళు . అయితే వీరి మధ్య సినిమాల ప్రస్తావన వచ్చేది కాదట. ఇక ఇంటర్ పూర్తయ్యాక సినిమాల్లో చేరాలన్న కోరికను పిల్లల మాటలను గౌరవించి ప్రోత్సహించే అతడి పేరెంట్స్ కి చెప్పాడు. అయితే డిగ్రీ కూడా లేకుండా ఎలా,అందుకే డిగ్రీ పూర్తిచేసి వెళ్ళు అంటూ తల్లిపెట్టిన షరతు మేరకు సికింద్రాబాద్ కాలేజీలో బికాం పూర్తిచేసాడు. చదువుపై శ్రద్ధ తక్కువ,సినిమాలపై,కళలపై మోజు ఎక్కువ గల శర్వానంద్ స్కూల్లో డ్రామా,డాన్స్ పోటీల జాబితాలో ముందుండేవాడట.

పరీక్షల జాబితాలో మాత్రం చివర ఉండేది. స్కూల్లో దింపడానికి వెళ్ళేటప్పుడు కారులోంచి, ఆటోలోంచి దూకేసి, పక్కనే గల ఆనంద్ థియేటర్ లో సినిమాలకు వెళ్లేవాడట. డిగ్రీ పూర్తయ్యాక సమ్మర్ లో జూబ్లీహిల్స్ లో ప్రతిరోజూ బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసేవాడు. ఆ సమయంలో హీరో ఆర్యన్ రాజేష్ కూడా అక్కడికి వస్తుండడం,సినిమాల్లో హీరో అవ్వాలన్న కోరిక వ్యక్తం చేయడంతో అతడి సూచన మేరకు పేరెంట్స్ కి చెప్పి ముంబయిలోని కిషోర్ నమిత నట శిక్షణలయంలో చేరాడు.

ఆరునెలలు ట్రైనింగ్ అయ్యాక, హైదరాబాద్ వచ్చి సినీ ఛాన్స్ లకోసం విశ్వప్రయత్నం చేసాడు. ఏకంగా రెండేళ్లు ఫిలిం నగర్ ఆఫీసుల చుట్టూ తిరిగాడు. కానీ ఎక్కడ ఛాన్స్ రాలేదు. ఆడిషన్స్ కి వెళ్లిన సెలక్ట్ కాకపోవడంతో నిరాశ చెందాడు. అయితే వైజాగ్ సత్యానంద్ యాక్టింగ్ స్కూల్లో శిక్షణ తీసుకుంటే ఫలితం ఉంటుందని ఎవరో చెప్పడంతో అక్కడికి చేరాడు. సత్యానంద్ యాక్టింగ్ స్కూల్లో చేరిన నేపథ్యంలో ఓ నిర్మాత,దర్శకుడు కొత్త నటులకోసం వెతుకుతూ స్కూల్ కి వచ్చారు.

అప్పుడే 5వ తారీఖు మూవీలో కి శర్వానంద్ ఎంపికయ్యాడు. హీరోగా చేసినా ఆసినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో తెలీదు. ఇక గౌరీ సినిమాలో హీరో ఫ్రెండ్ కేరక్టర్ గా డైరెక్టర్ రమణ ఛాన్స్ ఇచ్చాడు. వెంటనే స్రవంతి రవికిశోర్ తీసిన యువసేన మూవీలో నలుగురు హీరోల్లో ఒకడుగా ఛాన్స్ దక్కించుకున్నాడు. శంకర్ దాదా ఎంబిబిఎస్,తరవాత సంక్రాంతి , లక్ష్మీ మూవీస్ లో ఛాన్స్ వచ్చింది. రాజు మహారాజు మూవీలో మోహన్ బాబుతో కల్సి నటించాడు.

ఇక వెన్నెల సినిమాలో సైకో పాత్రతో కూడిన హీరో వేషం వచ్చింది. ఇక ఆతర్వాత అమ్మచెప్పింది మూవీతో శర్వానంద్ మానసికంగా ఎదగని కుర్రాడి పాత్ర చేసి,అందరి ప్రశంసలు అందుకున్నాడు. గమ్యం సినిమా చేసి అమెరికా వెళ్లిపోయిన శర్వానంద్ కి ఆ సినిమా హిట్ తో దశ తిరిగింది. నిరాశ స్థానంలో ఆశలు చిగురించాయి. ప్రస్థానం మూవీతో మంచి పేరువచ్చింది. జర్నీ మూవీ తెలుగు,తమిళ భాషల్లో సక్సెస్ అయింది. 2014లో రన్ రాజా రన్ మూవీతో స్టార్ హీరో అయ్యాడు. మళ్ళీ మళ్ళీ ఇది రానిరోజు,ఎక్స్ ప్రెస్ మూవీస్ తో అదరగొట్టిన శర్వానంద్ 2017లో శతమానం భవతి మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు మహానుభావుడు, పడిపడి లేచే మనసు చిత్రాలు చేసి నటనలో మరో మెట్టు ఎక్కాడు.