సింహాద్రి సినిమాని మిస్ చేసుకున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?
Ntr simhadri Movie : ఒక్కొక్క హీరోని దృష్టిలో ఉంచుకుని ఒక్కో సినిమా కథ రూపొందిస్తారు. తీరా సదరు హీరోకి ఖాళీ లేకపోవడంతోనో, బిజీ వల్లనో, కథ నచ్చకో .. మొత్తానికి ఏదో ఒక కారణంతో సినిమా చేయడానికి వీలు పడదు. దాంతో హీరో మారిపోతాడు. హీరోయిన్స్, మారతారు. కథలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ సినిమా హిట్ అయ్యాక అనవసరంగా వదులుకున్నామనే బాధ ఉంటుంది.
సరిగ్గా సింహాద్రి మూవీ విషయంలో అదే జరిగింది. ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీకి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. జూనియర్ ఎన్టీఆర్ నటనకు జనం నీరాజనం పట్టారు. సినిమా బ్లాక్ బస్టర్ అయింది. భూమిక, అంకిత హీరోయిన్స్ గా చేసిన ఈ మూవీలో నాజర్, సీత, భానుచందర్, శరత్ సక్సేనా, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, వేణుమాధవ్, సమీర్, ముఖేష్ రుషి కీలక పాత్రలు పోషించారు.
అయితే ఈ సినిమా కథను జక్కన్న మొదటగా ప్రభాస్ కి వినిపించాడట. అయితే కథలో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనడంతో మొత్తం తేడా కొడుతుందని జక్కన్న చెప్పాడట. తర్వాత బాలకృష్ణ దగ్గరకు చేరింది. అయితే తనకు ఈ కథ సూటవ్వదని చెప్పేయడంతో తారక్ దగ్గరకు వెళ్లి బ్లాక్ బస్టర్ అయింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది