Healthhealth tips in telugu

యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఉల్లిపాయ తింటే ఏమి అవుతుందో తెలుసా ?

Uric Acid Onion Home Remedies : యూరిక్ యాసిడ్ అనేది శరీరంలో కొంత మొత్తంలో ఉంటుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువ అయినప్పుడు చేతి వేళ్ళకు వాపులు రావటం,కీళ్ల నొప్పులు వంటి ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ చాలా వరకు రక్తంలో కరిగి మూత్రపిండాల ద్వారా విసర్జించబడుతుంది.
uric acid
శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉండటం వల్ల, కిడ్నీపై ఎక్కువ ఒత్తిడి పెరుగుతుంది. దాని కారణంగా అది ఫిల్టర్ చేయలేకపోతుంది. ఈ యాసిడ్ కీళ్ళలో పేరుకుపోతుంది. కాబట్టి దాన్ని తగ్గించుకోవటం చాలా ముఖ్యం. యూరిక్ యాసిడ్ ని పెంచే ఆహారాలకు దూరంగా ఉండాలి. అలాగే యూరిక్ యాసిడ్ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకోవాలి.
Eating raw onion with meals health benefits telugu
యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పుడు అసలు అశ్రద్ద చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. డాక్టర్ సూచనలను పాటిస్తూ ఇంటి చిట్కాలను ఫాలో అవ్వవచ్చు. యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి ఉల్లిపాయ బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయలో పొటాషియం, మెగ్నీషియం, సోడియం, ఫోలేట్, ఫాస్పరస్, విటమిన్ ఎ, విటమిన్ సి మరియు విటమిన్ ఇ సమృద్దిగా ఉంటాయి.
Onion benefits in telugu
అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ అలెర్జీ, యాంటీ కార్సినోజెనిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ లక్షణాలన్నీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిని అదుపులో ఉంచటానికి సహాయపడతాయి. జీవక్రియ బాగా జరిగేలా చేసి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. యూరిక్ యాసిడ్ ని నియంత్రించటంలో అధిక బరువు కూడా కీలకమైన పాత్రను పోషిస్తుంది.

ఒక ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి నీరు సగం అయ్యేవరకు మరిగించి ఆ నీటిని వడకట్టి తాగాలి. లేకపోతే ఉల్లిపాయను రసం తీయాలి. ఈ రసాన్ని ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. యూరిక్ యాసిడ్ స్థాయి తగ్గాలంటే కనీసం ప్రతి రోజు 10 నుంచి 12 గ్లాస్ ల నీరు తాగటానికి ప్రయత్నం చేయాలి. నీరు యూరిక్ యాసిడ్ తో పాటు మీ శరీరంలోని వ్యర్థాలన్నింటినీ బయటకు పంపటానికి సహాయపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.