నా జీవితం ఇలా అవ్వటానికి కారణం విజయ శాంతి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన వై విజయ
Actress Y Vijaya Says Vijaya Shanthi :తెలుగు సినీ రంగంలో గయ్యాళి పాత్రలంటే సూర్యకాంతం గుర్తొస్తుంది. కానీ తన సినిమా కెరీర్ మొదట్లో వై విజయ కూడా గయ్యాళి పాత్రలతోనే ఆడియన్స్ కి దగ్గరైంది.తెలుగు,మళయాళ,తమిళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించిన వై విజయ 2000సంవత్సరం నుంచి చిత్ర పరిశ్రమకు దూరమై, మళ్ళీ ఎఫ్ 2లో వై విజయ కు మంచి పాత్ర దొరకడంతో ఇండస్ట్రీలో ఆమె పేరు బాగానే వినిపిస్తోంది. అనిల్ రావిపూడి డైరక్షన్ లో వెంకటేష్,వరుణ్ తేజ్ లు హీరోలుగా నటించిన ఈ మూవీ ఈ సంక్రాంతికి విడుదలై బ్లాక్ బస్టర్ కొట్టింది. ఈమధ్య ఓ ఇంటర్యూలో ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో నటుడు,నటి విజయం సాధించవచ్చు.
సక్సెస్ ఎల్లకాలం రాదు. కానీ ఎప్పటికీ స్టార్స్ గానే ఉంటామని కొందరు భ్రమ పడ్డారు. సరైన ప్లాన్ లేనందున ఛాన్స్ లు రానిసమయంలో ఆస్తులు కూడా పోగొట్టుకున్న వాళ్ళు వున్నారు’అని చెప్పుకొచ్చింది. ‘నేను విజయశాంతితో ఎక్కువ మూవీస్ లో నటించాను. మా ఇద్దరి మధ్యా మంచి అనుబంధం ఉండేది. ‘ఫీల్డ్ లో ఎప్పుడు ఛాన్స్ లు వస్తాయో ,ఎప్పుడు రావో తెలియదు. అందుకే ఆదాయం అందేలా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి.
షాపింగ్ కాంప్లెక్స్ లాంటివి కట్టుకుంటే మంచిది’అని కారులో వెళ్తుండగా సలహా ఇచ్చింది. ఇంటికి వచ్చి తన భర్తకి విషయం చెప్పి,చెన్నైలోని మా స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ కట్టేసాం. నాకు ఛాన్స్ లు లేని కాలంలో దీనిపై వచ్చే రెంట్లు ఆధారం అయ్యాయి. అలా విజయశాంతి ఇచ్చిన సలహా ఎంతగానో సహాయపడింది’ అని వై విజయ చెప్పింది.
‘నేను ఎన్టీఆర్, అక్కినేని,సావిత్రి వంటి గొప్ప నటులతో నటించాను. అందుకే వృత్తిపట్ల అంకితభావం పెరిగింది. సీనియర్స్ ని గౌరవించడం నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు ఎవరికీ సీనియర్స్ పట్ల గౌరవంగానీ, సెట్లో క్రమశిక్షణ గానీ లేవు. ఆరోజుల్లో భయ భక్తులతో సమయానికి సెట్ కి చేరుకునేవాళ్ళం’అని వై విజయ వివరించింది. విజయశాంతి ఆనాడు చెప్పిన మాటలు పట్టించుకోకపోతే ఛాన్స్ లు లేని రోజుల్లో మా కుటుంబం ఇబ్బందుల్లో ఉండేదని గుర్తుచేసుకుంది.