2 వారాలు కీళ్లనొప్పులు,కండరాల నొప్పులు,బలహీనత,రక్తహీనత సమస్యలు జీవితంలో ఉండవు
Anemia home remedies in telugu : ఈ రోజుల్లో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యల నుండి బయట పడటానికి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తుంటాం. సమస్యలు చిన్నగా ఉన్నప్పుడూ ఇప్పుడు చెప్పే రెమిడీ చాలా బాగా సహాయపడుతుంది. ఈ రెమిడీ కోసం కేవలం 3 ఇంగ్రిడియన్స్ ఉపయోగిస్తున్నాం.
ఒక బౌల్ లో ఒక స్పూన్ శనగలు, 4 బాదం పప్పులు, 4 నల్ల కిస్ మిస్ వేసి నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం నానిన శనగలు,బాదంపప్పు, కిస్ మిస్ లను తింటూ ఆ నీటిని తాగాలి. బాదంపప్పు తొక్క తీసి తినాలి. ఈ విధంగా 15 రోజుల పాటు తింటే మంచి ఫలితం ఉంటుంది.
వీటిని తింటే కలిగే ప్రయోజనాల విషయానికి వస్తే…రక్తహీనత సమస్య తొలగిపోతుంది. శరీరంలో రోగనిరోదక శక్తి పెరిగి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రావు. శారీరక బలహీనతను తగ్గించి శరీరానికి అవసరమైన శక్తిని ఇవ్వటమే కాకుండా బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
వీటిని తీసుకోవడం వలన కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు నడుం నొప్పి ఒంటి నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. జీర్ణ సంబంద సమస్యలు గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్దకం వంటి సమస్యలు ఏమి ఉండవు. బరువు తగ్గటానికి కూడా సహాయపడుతుంది. తినాలనే కోరిక తగ్గి ఆకలి కూడా తొందరగా వేయదు.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/