Beauty Tips

ఇలా చేస్తే చుండ్రు, జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు 3 రెట్లు వేగంగా పెరుగుతుంది

Dandruff Home Remedies In telugu : ఇప్పుడు ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సమస్యలలో చుండ్రు ఒకటి. చుండ్రు సమస్య ఒకసారి వచ్చిందంటే తగ్గించుకోవడానికి చాలా కష్టం అవుతుంది. తలలో జిడ్డు ఎక్కువగా ఉండటం, వాతావరణంలో మార్పులు, కెమికల్స్ ఎక్కువగా ఉన్న ప్రొడక్ట్స్ వాడటం వంటి అనేక రకాల కారణాలతో ఈ సమస్య వస్తుంది.

చుండ్రు సమస్యను తగ్గించుకోవటానికి ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తాయి. ఇప్పుడు చెప్పే రెమెడీ ఫాలో అయితే చుండ్రు సమస్య నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈ రెమిడీ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ఒక కప్పులో మూడు స్పూన్ల బియ్యం వేసి దానిలో గ్లాసు నీటిని పోసి నాలుగు నుంచి ఐదు గంటల పాటు నానబెట్టి ఆ నీటిని వడగట్టి పక్కన పెట్టుకోవాలి.

ఒక ఉల్లిపాయ తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం నీరు, ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ వాము, ఒక స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూన్ లవంగాల పొడి వేసి నీరు సగం అయ్యే వరకు మరిగించాలి.ఈ నీటిని వడగట్టి చల్లారనివ్వాలి. ఈ నీరు చల్లారాక ఒక స్పూను వేప నూనె వేసి బాగా కలిపి స్ప్రే బాటిల్ లో పోసి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా స్ప్రే చేయాలి.
Onion benefits in telugu
అరగంట అయ్యాక కుంకుడు కాయతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య క్రమంగా తగ్గుతుంది. చుండ్రు సమస్య తగ్గుముఖం పట్టాకా వారంలో ఒకసారి చేస్తే సరిపోతుంది. ఈ చిట్కా చుండ్రు సమస్యను తగ్గించటమే కాకుండా జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
Diabetes tips in telugu
బియ్యం నీరులో ఉన్న లక్షణాలు చుండ్రు సమస్యను మరియు జుట్టుకి సంబందించిన అన్నీ రకాల సమస్యలను తగ్గించటానికి చాలా బాగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో సల్ఫర్ సమృద్దిగా ఉండుట వలన చుండ్రును సమర్ధవంతంగా ఎదుర్కొంటుంది. లవంగాలలో ఉండే యాంటీ బ్యాక్టీరియాల్ లక్షణాలు చుండ్రు సమస్యను తగ్గించటానికి సహాయపడతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.