ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తుందో తెలుసా?
Telugu actress saranya mohan :విలేజ్ లో వినాయకుడు మూవీలో చిన్నగా పొట్టిగా అందంగా మెరిసిన హీరోయిన్ శరణ్య మోహన్. ఈమె తెలుగు వారి అమ్మాయిలా కలిసిపోయింది. ఈమెను చూస్తే అచ్చతెలుగు అందంలా కనిపించింది. కానీ ఆమెది తెలుగు నాడు కాదు. కేరళ.. ఈ మలయాళి కుట్టి అందం, అభినయం లో ఎంతో ఆకట్టుకుంది. తెలుగులోనే కాదు తమిళ, మళయాళ భాషలలో నటీమణిగా రాణించింది. తెలుగులో నటించిన విలేజ్ లో వినాయకుడు సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఈమెకు మళయాళీ సినిమాలు యారాడీ నీ మోహిణీ మరియు వెన్నిల కబాడి కుజు వంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ హోదా వచ్చింది.
శరణ్య మోహన్ కేరళలోని అలెప్పుఝాలో 1989 ఫిబ్రవరి 9న జన్మించింది. వీరు పాలక్కాడ్ అయ్యవార్లు. అంటే బ్రాహ్మణ వంశానికి చెందిన వారు. మోహన్ -దేవికలు శరణ్య తల్లిదండ్రులు.. శరణ్యకు ఒక చెల్లి సుకన్య కూడా ఉంది. శరణ్య తల్లి దేవిక శాస్త్రీయ నాట్య కళాకారిణి. ఆమెకు ఆళప్ప ఝలో నాట్య పాఠశాల కూడా ఉంది.
దీంతో చిన్నప్పటి నుంచే తల్లిని చూసి శరణ్య భారతనాట్యంలో విశేష ప్రావీణ్యం సందించింది. ఆళప్పఝాలోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఆంగ్ల సాహిత్యంలో బీఏ పూర్తి చేసింది. డిగ్రీ తర్వాత ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ను అన్నమలై యూనివర్సిటీలో పూర్తి చేసింది. ఆ తర్వాత భరతనాట్యంలో ఎంఎఫ్ఏ పూర్తి చేసింది.
శరణ్య స్కూళ్లో భరతానట్యం చేస్తుండగా మళయాల దర్శకుడు ఫాజిల్ మొదట చూసి ఆమె నాట్యానికి ఫిదా అయ్యాడు. అలా 1997లో మళయాళ మూవీ అనియాతీ ప్రావు చిత్రంలో చైల్డ్ ఆర్టిస్టుగా శరణ్యకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత కాదిలక్కు మరియాదాయే అనే చిత్రంలోనూ చైల్డ్ ఆర్టిస్టుగా శరణ్య నటించి మెప్పించింది.
ఆ తర్వాత ఏకంగా మళయాల సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ తో కలిసి హరికృష్ణన్స్ సినిమాతో మరోసారి చైల్డ్ ఆర్టిస్ట్ గా అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించింది.కళలపై అభిమానంతో హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నించింది. అప్పుడు 2008లో ‘ఏరాడి నీ మోహిని’ అనే మలయాళీ చిత్రంలో శరణ్యకు అవకాశం వచ్చింది.
ఆ తర్వాత 2011లో ఓస్తీ అనే సినిమాలో చక్కటి అభినయాన్ని ప్రదర్శించి ఆకట్టుకుంది. 2011లో తమిళంలో రిలీజ్ అయిన వేలాయుద్ధం సినిమాలో శరణ్య నటనకు మంచి మార్కులు పడి ఆ సినిమా ఘనవిజయం సాధించి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తెలుగులోనూ కృష్ణుడు హీరోగా వచ్చిన ‘విలేజ్ లో వినాయకుడు’ సినిమాలో హీరోయిన్ గా నటించింది.
అడపదడపా సినిమాలు రావడంతో చేసి ఊరుకుంది. ఇక సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో 2015 సెప్టెంబర్ 6న పారిశ్రామికవేత్త అరవింద్ క్రిష్ణన్ ను పెళ్లి చేసుకుంది. ఈమెకు ఓ కొడుకు . ప్రస్తుతం భర్త, కొడుకు ను చూసుకుంటూ సంసార జీవితాన్ని గడుపుతోంది.
https://www.chaipakodi.com/