Healthhealth tips in telugu

1 గ్లాసు తాగితే చాలు జీవితాంతం కాళ్ళ నొప్పులు,వెన్ను నొప్పి,నీరసం,నిద్రలేమి సమస్యలు ఉండవు

Makhana benefits in telugu : ఈ రోజుల్లో మారిన జీవనశైలి కారణంగా మనలో చాలా మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ముఖ్యంగా కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,వెన్ను నొప్పి, బలహీనత,నీరసం,నిద్రలేమి వంటి ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఆ సమస్యలను తగ్గించుకోవటానికి ఆయుర్వేదంలో ఒక మంచి డ్రింక్ ఉంది.
gasagasalu uses
ఈ డ్రింక్ కోసం ఒక స్పూన్ గసగసాలను నీటిని పోసి రెండు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టి రెండు స్పూన్ల ఆవు నెయ్యి వేసి దానిలో నానిన గసగసాలను నీటిని తీసివేసి వేగించాలి. ఇవి కాస్త వేడి అయ్యాక అరస్పూన్ తెల్ల నువ్వులను వేసి వేగించాలి. ఆ తర్వాత 10 పూల్ మఖానాలను వేసి వేగించాలి.
Lotus Seeds benefits In Telugu
ఆ తర్వాత ఒక గ్లాస్ పాలను వేసి 3 నిమిషాల పాటు మరిగించి ఆ తర్వాత చిన్న బెల్లం ముక్క వేసి ఒక నిమిషం మరిగించి ఆ తర్వాత గ్లాసులో పొడి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు తాగితే సరిపోతుంది. గసగసాలు మనస్సు ప్రశాంతంగా ఉండేలా చేసి మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది.
Jaggery Health Benefits in Telugu
మఖానాలో ఉండే పోషకాలు నొప్పులను తగ్గించటంలో చాలా సమర్ధవంతంగా పని చేస్తాయి.అలాగే ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు ఏమి లేకుండా చేస్తుంది. అలాగే రక్తహీనత,నీరసం,అలసట ఉన్నవారు కూడా ఈ పాలను తీసుకుంటే మంచి ప్రయోజనం కనపడుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/