Healthhealth tips in telugu

శనగలను ఎక్కువగా తింటున్నారా…తినే ముందు ఒక్కసారి ఈ నిజాన్ని తెలుసుకోండి

Chickpeas health benefits in telugu : శనగలను మనలో చాలా మంది చాలా ఇష్టంగా తింటారు. శనగలను కొంతమంది నానబెట్టి ఉడికించి తాలింపు పెట్టుకుని తింటుంటారు. కొంతమంది కూరల్లో వేస్తూ ఉంటారు. శనగలను ఏ రూపంలో తీసుకున్నా మంచి ప్రయోజనం కనబడుతుంది. మాంసం తినలేనివారికి ఒక అద్భుతమైన ఆహారం అని చెప్పవచ్చు. శనగల్లో ప్రోటీన్స్ చాలా సమృద్ధిగా ఉంటాయి.

chickpeas in telugu

శనగల్లో పొటాషియం సమృద్ధిగా ఉండటం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. ప్రతి రోజూ ఒక స్పూన్ శనగలను తింటుంటే రక్తపోటు సమస్య ఉండదు. అయితే రక్తపోటు సమస్య వచ్చినప్పుడు డాక్టర్ సూచనల ప్రకారం మందులను తప్పనిసరిగా వాడాలి.మందులు వాడుతూ ఇలా ఇంటి చిట్కాలను కూడా ఫాలో అవ్వవచ్చు.

Chickpeas health benefits in telugu

శనగల్లో glycemic index చాలా తక్కువగా ఉండటం వలన వీటిని తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. అలాగే శనగల్లో ఉండే ఫైబర్ నిదానంగా జీర్ణం అవుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్న వారికి మంచి ఆహారం అని చెప్పవచ్చు. శ‌న‌గ‌ల్లో రాఫినోస్ అన‌బ‌డే సాల్యుబుల్ ఫైబ‌ర్ ఉంటుంది. ఇది జీర్ణ ప్రక్రియ‌ను మెరుగు ప‌రుస్తుంది.

శనగల్లో ఐర‌న్‌, calcium, విట‌మిన్ సి, ఎ, ఇ, ఫోలేట్‌, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉండుట వలన ఎముకలు, ఆరోగ్యంగా బలంగా ఉంటాయి. అలాగే హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచి రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది. శనగల్లో ఉండే సెలీనియం, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు చెడు cholesterol ని తగ్గించి మంచి cholesterol పెరిగేలా ప్రోత్సహిస్తాయి.

శనగలను రోజులో 2 స్పూన్లకు మించి తినకూడదు. ఒకవేళ తింటే జీర్ణ సంబంద సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా మితంగా తింటేనే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

https://www.chaipakodi.com/