MoviesTollywood news in telugu

తల్లి పాత్రలో నటించే సీనియర్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…!

Tollywood Mother Characters Remuneration:ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన హీరోయిన్స్ ప్రస్తుతం తల్లి, అత్త పాత్రలో నటిస్తున్నారు. వీరు రోజుకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. విరు చాలా బిజీగా నచ్చిన సినిమాలను ఎంచుకుంటూ ఈ వయస్సులో కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటున్నారు.

ఒకప్పుడు హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం తల్లి, అత్త పాత్రలు చేస్తున్న జయసుధ రోజుకి రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం తల్లి పాత్రలో నటిస్తుంది. రోజుకి మూడు నుంచి నాలుగు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది

అత్తారింటికి దారేది సినిమాతో మంచి పాపులార్టీ సంపాదించుకున్న నదియా రోజుకి రెండు లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది

ఈ మధ్యకాలంలో ఎక్కువగా యంగ్ జనరేషన్ హీరోలకు తల్లిగా నటిస్తున్న రోహిణి రోజుకి 50 నుంచి 60 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

సీనియర్ నటి రేవతి రోజుకు ఇంతని కాకుండా ఒక్కో సినిమాకు తన పాత్ర పరిధిని బట్టి దాదాపుగా 25 లక్షల వరకు తీసుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో ఎక్కువగా తల్లి పాత్రలో నటిస్తున్న తులసి కూడా రోజుకి దాదాపుగా 60,000 దాకా తీసుకుంటుంది. ఈమెకు పారితోషికం ఎక్కువగా తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ పెద్దగా పారితోషకం గురించి పట్టించుకోదట.
https://www.chaipakodi.com/