MoviesTollywood news in telugu

‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకు గుర్తున్నాడా.. ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా..?

Athadu Child artist Deepak saroj : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన అతడు మూవీ ఎమోషనల్, కామెడీ, థ్రిల్లర్ మూవీగా తెరకెక్కి, అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇందులో బ్రహ్మానందం కామెడీ అదిరిపోతోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కొడుకు గా నటించిన కుర్రాడు … ‘నాన్నా ట్రైన్ తీసుకురమ్మన్నా.. తెచ్చావా’ అంటూ అని అడిగితే.. ‘ఆ తెచ్చాన్రా పట్టాల మీదుంది వెళ్లి తెచ్చుకో’ అని బ్రహ్మానందం చెబుతాడు గుర్తుందా?

అలాగే మాస్ మహారాజ్ రవితేజ నటించిన భద్ర మూవీలో అన్నయ్య సాంబార్‌లో చికెన్ వేసుకో బాగుంటుంది అని.. ఓ చిన్నోడికి చిన్నది చెప్తుంది. అతడు మూవీలో చేసిన కుర్రాడే ఆ చిన్నోడు. అంతవరకూ బాగానే ఉంది అసలు విషయం ఏమిటంటే, ఇతగాడి పేరు దీపక్ సరోజ్. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. టీనేజ్ లోకి వచ్చిన యితడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట.
Athadu movie child artist
దీపక్ చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపు 20 సినిమాలకు పైగానే నటించి, మిణుగురులు సినిమాలో నటించాడు. 2014లో వచ్చిన ఈ సినిమాకు సంబంధించి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. తర్వాత చదువు కోసం బ్రేక్ తీసుకున్నాడు. నిజానికి బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ లిస్టులో దీపక్ పేరు విన్పించినా ఎంట్రీ పడలేదు. ఇప్పుడు సినిమాకోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మోడలింగ్ వైపు కూడా అడుగులు వేస్తున్నాడు.

హీరోగా వందనం అనే సినిమాలో కూడా నటించారు. అయితే ఈ సినిమా అందరికి తెలియదు. ఇప్పుడు “సిద్ధార్థ్ రాయ్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రేక్షకులను ఎంత వరకు మెప్పిస్తాడో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."