బాహుబలిని వదులుకున్న దురదృష్టవంతులు ఎవరో తెలుసా?
Rajamouli bahubali details:రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసింది. ఈ సినిమాలో నటించిన నటీనటులు అందరికి మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో నటించిన నటులు అదృష్టవంతులు అని చెప్పాలి. ఈ సినిమాలో నటులను చూసాక ఆ పాత్రలో మరొక నటులను చూడలేము. వారు అంతలా నటించి మెప్పించారు. బాహుబలి సినిమాలో కీలకపాత్రల కోసం ముందుగా రాజమౌళి ఎవరిని అనుకున్నారో తెలుసా?
శివగామి పాత్ర విషయానికి వస్తే మొదటగా రాజమౌళి అతిలోకసుందరి శ్రీదేవిని అడిగాడు. శ్రీదేవి నో చెప్పటంతో నరసింహ పాత్రలో శివగామిగా అందరి ప్రశంసలు పొందిన రమ్యకృష్ణకు ఆ అవకాశం వచ్చింది. బాహుబలి సినిమాలో శివగామి అంటే రమ్యకృష్ణ గుర్తుకువచ్చేలా ఆమె నటించింది. అలాగే శివగామి పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది.
బాహుబలిలో కట్టప్ప పేరు బాగా మారుమ్రోగిపోయింది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానం కోసం ప్రేక్షకులు రెండు సంవత్సరాలు వెయిట్ చేసారు. కట్టప్ప పాత్ర కోసం మొదట మోహన్ లాల్ ని అడిగాడట రాజమౌళి. మోహన్ లాల్ నో చెప్పటంతో ఆ అవకాశం సత్య రాజ్ కి వచ్చింది.
బాహుబలి సినిమాలో భల్లాలదేవ పాత్రకు కూడా మంచి స్పందన రావటమే కాకుండా రానాను వరల్డ్ వైడ్ గా ఫెమస్ అయ్యేలా చేసింది. అయితే మొదట రాజమౌళి భల్లాలదేవ పాత్ర కోసం వివేక్ ఒబెరాయ్ ని సంప్రదించాడు. ఆ సమయంలో వివేక్ ఒబెరాయ్ బిజీగా ఉండటంతో నో చెప్పాడు. దాంతో ఆ అవకాశం రానాకు వచ్చింది.
అవంతిక పాత్రలో మిల్కి బ్యూటీ తమన్నా అద్భుతంగా నటించింది. ఈ పాత్ర కోసం మొదట రాజమౌళి అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ని అడిగారట. ఆమె నో చెప్పటంతో ఆ అదృష్టం తమన్నాకి దక్కింది.
దేవసేన పాత్ర కోసం మొదట రాజమౌళి నయనతారను సంప్రదించారు. ఆమె నో చెప్పటంతో దేవసేన పాత్ర అనుష్కను వరించింది.
Click Here To Follow Chaipakodi On Google News