MoviesTollywood news in telugu

సూపర్ స్టార్ మహేష్ ఎత్తుకున్న ఈ చిన్నారిని గుర్తు పట్టారా…?

Mahesh Babu And Sri Divya :మనసారా అనే సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీ దివ్య తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో కూడా సినిమాలు చేస్తోంది. అయితే ఈమె చిన్నప్పటి ఫోటో ఒకటి చక్కర్లు కొడుతోంది. పైగా ప్రస్తుతం సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు ఎత్తుకుని ఉన్నాడు.

ఎవరా ఈ అమ్మాయి అని నెట్ లో ఆరా తీస్తే, శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలో చేసిందని తేలింది. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన యువరాజు సినిమాలో శ్రీదివ్య చిన్న పాత్రలో కనిపించి అలరించింది. ఆ ఫోటోయే ఇప్పుడు వైరల్ గా మారింది. ఫోటో గమనిస్తే,మహేష్ బాబులో అప్పటికీ ఇప్పటికీ పెద్దగా మార్పు లేదు గానీ ఆమె మాత్రం హీరోయిన్ గా మారింది.

మనసారా మూవీ తర్వాత బస్ స్టాప్,కేరింత సినిమాలు చేసింది. తెలుగులో తక్కువ సినిమాలే చేసినా, తన అందంతో, నటనతో ఆడియన్స్ కి దగ్గరైంది. ఆ తర్వాత తమిళ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అవకాశాలు దక్కించుకుంది. ముఖ్యంగా విశాల్, కార్తీ,శివకార్తికేయన్‌‌‌ తదితర హీరోలతో జోడీ కట్టి నటించి మెప్పించింది. తెలుగులో మంచి ఛాన్స్ వస్తే సినిమా చేయాలని ఎదురుచూస్తోంది.