తమ్ముడు సినిమాలో పవన్ తో జోడి కట్టిన ఈ హీరోయిన్ ఏమి చేస్తుందో తెలుసా?
Thammudu Movie Heroine Preeti Jhangiani:తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రీతి జింగానియా నటించి తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది. ఆ తర్వాత మోహన్ బాబు, బాలకృష్ణ వంటి హీరోలతో నటించిన ఆ తర్వాత సినిమాలకు దూరం అయింది. తెలుగులో నరసింహ నాయుడు, అప్పారావు డ్రైవింగ్ స్కూల్, విశాఖ ఎక్స్ప్రెస్, అధిపతి వంటి తెలుగు సినిమాల్లో నటించింది. ఎన్టీఆర్ సరసన యమదొంగ సినిమాల్లో ఒక సాంగ్ లో కనిపించింది ఈ అమ్మడు. తమ్ముడు సినిమా ఇచ్చిన హిట్ ని ఏ సినిమా ఇవ్వలేకపోయింది.

హిందీలో కొన్ని సినిమాలను చేసిన అవి పెద్దగా హిట్ కాకపోవటంతో 2008 లో పర్వీన్ ను వివాహం చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా కుటుంబానికి సమయాన్ని కేటాయించింది. సినిమాలకు దూరం అయినా సరే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంది. మంచి అవకాశం వస్తే రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేయటానికి సిద్దంగా ఉంది. తెలుగులో కన్నా ముందు తమిళం, మలయాళం, హిందీ, కన్నడ, ఉర్దూ సినిమాల్లో నటించింది.

