సుమంత్,కీర్తి రెడ్డి విడిపోవడానికి అసలు కారణాలు ఇవేనట…నమ్మలేని నిజాలు
Sumanth and Keerthi Reddy :తెలుగులో ప్రేమ కథ, సత్యం, స్నేహమంటే ఇదేరా గౌరీ, గోదావరి, పౌరుడు, గోల్కొండ హై స్కూల్ తదితర హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి అక్కినేని హీరో సుమంత్ గురించి పెద్దగా పరిచయం చేయవలసిన అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో సుమంత్ హీరోగా నటించినటువంటి పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి.
దీంతో గత కొద్ది కాలంగా సుమంత్ కథల విషయంలో కొంతమేర ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా సుమంత్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి పలు విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇందులో భాగంగా ఇంటర్వ్యూ చేసే వ్యక్తి “మీరు మీ భార్య కీర్తి రెడ్డితో ఎందుకు విడిపోయారని, అందుకు గల కారణాలను తెలియచేయాలని” అడిగాడు.దీంతో సుమంత్ తనకి కీర్తి రెడ్డికి పెళ్లి అయిన రెండు సంవత్సరాల తర్వాత పరస్పర అంగీకారంతోనే విడిపోయామని తెలిపాడు. ప్రస్తుతం కీర్తి రెడ్డి మళ్లీ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందని అంతేగాక కీర్తి రెడ్డికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపాడు.
తాము భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ ఇప్పటికీ కూడా మంచి స్నేహితులుగా ఉన్నామని, అప్పుడప్పుడు కీర్తి రెడ్డి కుటుంబ సభ్యులను కూడా తాను కలుస్తుంటానని చెప్పుకొచ్చాడు.మామూలుగా పెళ్లయిన తర్వాత భార్య భర్తలు కలవడం మరియు స్నేహితులుగా ఉండటం చాలా అరుదుగా ఉంటుందని, కానీ కీర్తి రెడ్డి విషయంలో మాత్రం తాను ఎప్పుడూ అసౌకర్యంగా ఫీల్ అవలేదని తెలిపాడు.
అలాగే కీర్తి రెడ్డి కుటుంబ సభ్యులు కూడా తనని తమ కుటుంబ సభ్యుల్లో ఒకడిగా భావిస్తారని ఆ విషయం తనకు బాగా నచ్చిందని, ప్రస్తుతం కీర్తి రెడ్డి సంతోషంగా ఉందని తెలిపాడు.

