10 రూపాయిల తొలి పారితోషికం తీసుకున్న స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…?
Senior Heroine Jayapradha :అందానికి అందం,అభినయానికి అభినయం కలబోసిన అచ్చ తెలుగు అందునా గోదావరి తీరం రాజమండ్రి అమ్మాయిగా సినీ పరిశ్రమలో ఎంతో ఎత్తుకి ఎదిగిన అగ్రశ్రేణి నటి జయప్రద. రాజమండ్రిలో ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన జయప్రద అసలు పేరు లలితారాణి. కందుకూరి రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజీలో చదివింది.
తెలుగులోనే కాదు హిందీలో కూడా దుమ్మురేపిన ఈమె ఏపీలో టిడిపి తరపున రాజ్యసభకు ఎన్నికయింది. అంతేగాదు, ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచి, రాజకీయంగా కూడా తన హవా సాగించింది. ఇటు తెలుగు, అటు హిందీ ఆడియన్స్ కి దగ్గరైన జయప్రద అందరి అగ్రహీరోలతో హిట్ సినిమాలు చేసింది.
ఓ పక్క కమర్షియల్ మూవీస్ తోనే కాకుండా మరోపక్క కళాత్మక చిత్రాలతో తన అసమాన నటనను ప్రదర్శించింది. చిన్న నాటినుంచి సంగీత నాట్యాల్లో ప్రావీణ్యం సంపాదించిన ఈమె డాక్టర్ అవ్వాలనుకుని యాక్టర్ అయింది. అది కూడా డాక్టరైన ఓ యాక్టర్ ద్వారానే కావడం విశేషం. జయప్రద 14ఏళ్ళ వయస్సులో నాట్య ప్రదర్శన ఇస్తుంటే,నటుడు డాక్టర్ ఎం ప్రభాకర రెడ్డి చూసి, భూమికోసం అనే తన సినిమాలో ఛాన్స్ ఇచ్చి, జయప్రద అనే పేరు పెట్టాడు. ఈ సినిమాలో కేవలం 10 రూపాయిల పారితోషికం తీసుకుంది.
దాంతో ఆమెకు అదృష్టం వెన్ను తట్టింది. ఆరు భాషల్లో 300చిత్రాల్లో నటించిన జయప్రద అంతులేనికథ,సిరిసిరిమువ్వ,అడవిరాముడు,యమగోల వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ అందుకుంది. సాగర సంగమం,మేఘసందేశం వంటి మూవీస్ తో కళాత్మక నటిగా గుర్తింపు తెచ్చుకున్న జయప్రద 90వ దశకంలో కేరక్టర్ ఆర్టిస్టుగా నటించడం మొదలుపెట్టింది.
హిందీలో ప్రముఖ నిర్మాత శ్రీకాంత్ నహతా పెళ్లయి ముగ్గురు పిల్లల తండ్రిగా ఉన్నాడు. ఆయితే అతడిని పెళ్లాడిన జయప్రద కు పిల్లలు కలగలేదు. దాంతో చెల్లెలి కొడుకికి సిద్ధార్థను పెంచుకుని,కన్నబిడ్డకంటే అపురూపంగా పెంచి పెద్ద చేసింది. తెలుగు రాష్ట్రానికి చెందిన ప్రవల్లిక రెడ్డితో సిద్ధార్ధ పెళ్లి జరిపించింది. రెండుసార్లు ఎంపీగా గెలిచిన జయప్రద నియోజకవర్గ ప్రజలే తనకు పిల్లలని చెప్పేది. అనుకోని పరిణామాల్లో సమాజ్ వాదీ పార్టీకి దూరమై,లోక్ దళ్ పార్టీలో చేరి,2014లో ఓటమి చెందింది. అప్పటినుంచి రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉంటున్న జయప్రద టెలివిజన్ షోస్ తో ఆకట్టుకుంటోంది.