గుడ్లు తింటే అలెర్జీ వస్తోందా.. ఇవి తింటే గుడ్డులోని పోషకాలు అన్ని అందుతాయి..!
Foods Replace Eggs:మనలో చాలామంది Egg తింటారు. అయితే కొంతమంది గుడ్డు అంటే అస్సలు ఇష్టం ఉండదు. కొంతమంది ఇష్టం లేక తినరు… మరి కొంతమందికి ఎలర్జీ ఉంటుంది. గుడ్డు తినకుండా గుడ్డులో ఉన్న పోషకాలు మన శరీరానికి అందాలంటే ఇప్పుడు చెప్పే ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది. వాటి గురించి తెలుసుకుందాం.
అరటిపండు
సంవత్సరం పొడవునా దొరికే అరటిపండు గుడ్డుకు గొప్ప ప్రత్యామ్నాయం అని చెప్పవచ్చు. చాలా చవకగా లభించే అరటి పండులో దాదాపుగా అన్ని సూక్ష్మ, స్థూల పోషకాలు ఉంటాయి. అరటిపండులో కార్బోహైడ్రేట్లు, విటమిన్ ఏ, సి, బి6, బి12 ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సోడియం, పొటాషియం వంటి పోషకాలు ఉండుట వలన మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి.
చియా సీడ్స్
గుడ్డుకు చియా సీడ్స్ బెస్ట్ రీప్లేస్‌మెంట్ అని చెప్పవచ్చు. దీనిలో ఉన్న పోషకాలను బట్టి ఒక సూపర్ ఫుడ్ గా చెప్పుతారు. వీటిలో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు,ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఒమెగా 3 సమృద్దిగా ఉంటాయి. కాబట్టి చియా సీడ్స్ తీసుకుంటే మన శరీరానికి ఎన్నో పోషకాలను అందిస్తుంది.
కందిపప్పు
మనం ప్రతి రోజు కందిపప్పును వాడుతూనే ఉంటాం. కందిపప్పులో ఉండే ప్రొటీన్లూ, కొవ్వులూ, కార్బో హైడ్రేట్‌లూ శరీరానికి అంది తక్షణ శక్తినీ అందిస్తాయి. ఫోలేట్ సమృద్దిగా ఉండుట వలన మహిళలకు మేలు చేస్తుంది.
బాదం పప్పు
బాదంను సూపర్ ఫుడ్ గా చెప్పవచ్చు. బాదంలో ఫైబర్, ప్రొటీన్, విటమిన్ ఈ, కాల్షియం, జింక్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి మెదడు, కళ్లు, ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. ప్రతి రోజు 5 బాదం పప్పులను నానబెట్టి తింటే.. ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. బాదం పప్పును నానబెట్టి తింటే 100 శాతం పోషకాలు మన శరీరానికి అందుతాయి.
https://www.chaipakodi.com/