Healthhealth tips in telugu

ఈ పొడిని ఇలా తీసుకుంటే 15 రోజుల్లో థైరాయిడ్ సమస్య మాయం అవుతుంది

Flax Seeds Thyroid problem home remedies : ఈ రోజుల్లో చాలామంది ప్రజలు థైరాయిడ్ సమస్య వల్ల ఎంతగానో బాధపడుతున్నారు. అయితే ఈ థైరాయిడ్ గ్రంధి పనితీరును మెరుగుపరచుకోవడంలో మన వంటింటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చాలా తొందరగా పరిష్కారం చూడాలి. ఈ మధ్య కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు.

ఈ సమస్య అనేది హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ కారణంగా వస్తుంది. ఈ వ్యాధి వచ్చిన వారు బరువు తగ్గటం,మందులు వేసుకుంటే సరిపోతుందని అనుకుంటూ ఉంటారు.కానీ ఈ సమస్యకు వ్యాయామంతో పాటు మంచి పోషకాహారం కూడా తీసుకోవాలి. థైరాయిడ్ హార్మోన్లు సరిగా పనిచేయకపోవడం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది. థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది.

ఇది జీవక్రియ రేటును అదుపులో ఉంచుతుంది. థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేయకపోతే జీవక్రియలు అస్తవ్యస్తంగా మారతాయి. థైరాయిడ్ గ్రంధి తక్కువ హార్మోన్లను విడుదల చేస్తే థైరాయిజం అని, ఎక్కువ హార్మోన్ విడుదల చేస్తే హైపర్ థైరాయిడ్ అని అంటారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంటుంది. దీనికి ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. కాస్త ఓపికగా చేసుకోవాలి.

థైరాయిడ్ సమస్యను తగ్గించటానికి అవిసె గింజలు చాలా సహాయపడతాయి. అవిసె గింజలను పాన్ లో వేసి డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిగా తయారుచేసుకొని సీసాలో పోసి నిల్వ చేస్తే 15 రోజుల పాటు వాడుకోవచ్చు. ప్రతి రోజు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో పావు స్పూన్ పొడిని కలిపి ఉదయం సమయంలో తాగాలి.
Flax seeds
ఈ విధంగా ప్రతి రోజు తాగుతూ ఉంటె థైరాయిడ్ సమస్య క్రమంగా తగ్గుతుంది. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు జీవితకాలం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ ఈ పొడిని తీసుకుంటూ ఉంటె చాలా బాగా ఉపశమనం కలుగుతుంది. అలాగే అధిక బరువు సమస్య నుండి కూడా బయట పడతారు. కాబట్టి ఈ పొడిని తీసుకోవటానికి ప్రయత్నం చేయండి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.