Healthhealth tips in telugu

పైల్స్ సమస్య ఉన్నవారు ఇలా చేస్తే చాలు…శాశ్వతంగా మాయం అవుతాయి

Ayurvedic treatment for piles : పైల్స్ సమస్య ఉన్నప్పుడు నిలబడాలన్నా,కూర్చోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది.అలాగే విపరీతమైన నొప్పి ఉంటుంది. పైల్స్ సమస్యను తగ్గించుకోవటానికి ఆయుర్వేదంలో ఒక మంచి చిట్కా ఉంది. 50 గ్రాముల ఎండు ద్రాక్ష, 50 గ్రాముల జీలకర్ర, 50 గ్రాముల పసుపు తీసుకోవాలి. జీలకర్రను దోరగా వేగించాలి.
piles home remedies
ఎండుద్రాక్ష,జీలకర్ర,పసుపు మెత్తని పేస్ట్ గా చేసి దీనిలో కాస్త తేనె కలిపి చిన్న చిన్న మాత్రల వలె తయారుచేసుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి చొప్పున నోట్లో వేసుకొని ఒక గ్లాస్ మంచి నీటిని తాగాలి. ఇలా మాత్రలను వాడుతూ పైల్స్ ఉన్న ప్రదేశంలో పైపూతగా రాయటానికి ఒక నూనెను తయారుచేసుకుందాం.

100 Ml ఆముదం, 25 గ్రాముల తేనె మైనంలను వేడి చేసి దానిలో 20 గ్రాముల కర్పూరం పొడి వేసి బాగా కలిపి డబ్బాలో నిల్వ చేసుకొని… పైల్స్ సమస్య ఉన్న ప్రాంతంలో ఈ మిశ్రమాన్ని ఉదయం ఒకసారి,రాత్రి సమయంలో ఒకసారి రాస్తే మూడు రోజుల్లో పైల్స్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
https://www.chaipakodi.com/