ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా..ఇప్పుడు ఎక్కడ ఏమి చేస్తుందో తెలుసా…?
Tollywood Heroine sindhu menon:వైశాలి , చందమామ సినిమాల్లో నటించిన సిందుమీనన్, దివంగత నటుడు శ్రీహరి హీరోగా నటించిన భద్రాచలం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సంగతి తెలిసిందే . భద్రాచలం సినిమా చేసేటప్పుడు సింధు వయసు పదిహేనేళ్లు . ఆ సినిమాలో పాటలు, శ్రీహరి ఫైట్లు , సింధు అభినయం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఒకప్పుడు తన నటనతో ఆకట్టుకున్న సింధుమీనన్ ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది, ఏం చేస్తుంది తెలుసా?సింధు బెంగుళూరు లోని ఓ మళయాలీ కుటుంబంలో జన్మించింది. ఆమెకు కార్తీక్ అనే ఒక తమ్ముడు ఉన్నాడు. అతను మొదట్లో కన్నడ మ్యూజిక్ చానల్లో వీజేగా పనిచేసి తరువాత నటుడు అయ్యాడు. సింధు తన మాతృభాషయైన మలయాళమే కాక, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఆంగ్ల భాషల్లో మాట్లాడగలదు .
చిన్నతనంలోనే భరత నాట్యం లో శిక్షణ తీసుకుంది సింధు. ఒకసారి భరత నాట్యం పోటీలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించిన భాస్కర్ హెగ్డే కన్నడ దర్శకుడు కె.వి. జయరాం కు పరిచయం చేయడంతో సినిమాల్లోకి వచ్చింది. అలా 1994 లో రష్మి అనే కన్నడ సినిమాలో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. 1999 లో 13 సంవత్సరాల వయసులో ప్రేమ ప్రేమ ప్రేమ అనే సినిమాలో కథానాయికగా నటించింది.
తరువాత 15 ఏళ్లకే తెలుగు లో భద్రాచలం, తమిళంలో ఉత్తమన్, మలయాళంలో సముత్తిరం అనే సినిమాల్లో నటించింది.తెలుగులో త్రినేత్రం, సిద్ధం, శ్రీరామచంద్రులు వంటి సినిమాల్లో నటించినప్పటికి చందమామ, వైశాలి మాత్రమే సింధు కెరీర్లో ఇప్పటికి గుర్తిండిపోయే సినిమాలు. వైశాలి, చందమామ సినిమాలు ఇప్పటికి తెలుగు ప్రేక్షకులని అలరిస్తుంటాయి. తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలలో నటించి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది సింధుమీనన్. కెరీర్లో ఆఫర్స్ తగ్గగానే, ఆలస్యం చేయకుండా పెళ్లి చేసుకుని కెరీర్ కి గుడ్ బై చెప్పింది.
https://www.chaipakodi.com