MoviesTollywood news in telugu

సౌత్ ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే టాప్ 5 హీరోలు..మీ అభిమాన హీరో..!

South indian heroes remuneration: టాలీవుడ్ పరిశ్రమ విస్తృతి బాగా పెరిగింది. ఇప్పుడు హాలివుడ్ రేంజ్ లో సినిమాలు ఉంటూ మంచి గుర్తింపును తెచ్చుకోవటంతో…ప్రపంచవ్యాప్తంగా సౌత్ హీరోలకు కూడా డిమాండ్ బాగా పెరిగింది. దానికి తగ్గట్టుగానే వారి రెమ్యూనరేషన్ కూడా పెరిగింది. వారి గురించి తెలుసుకుందాం.

రజనికాంత్ కి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. రజనీకాంత్ విషయానికి వస్తే… జైలర్ చిత్రానికి గాను 150 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

బాహుబలి సినిమాతో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.ఆ తర్వాత సినిమాలు పెద్దగా ఆడకపోయినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం చేసే సినిమాకు దాదాపుగా 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి.

అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయి…ఒక్కో సినిమాకి 125 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

విజయ్ ఒక సినిమాకు గాని 120 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి.

తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చి తమిళంలో స్టార్ హీరోగా మారిన అజిత్ ఒక్కో సినిమాకి దాదాపుగా 100 కోట్ల రూపాయిలను తీసుకుంటాడు.

RRR సినిమాతో  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న  రామ్ చరణ్ ప్రస్తుతం చేయబోయే సినిమాలకు 80 నుంచి 100 కోట్ల రూపాయల వరకు పారితోషికం డిమాండ్ చేస్తున్నాడట.

ఇక పవన్  కళ్యాణ్, చిరంజీవి  మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ధనుష్ వంటి హీరోలు 100 కోట్ల రూపాయల లోపు పారితోషకం తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.