MoviesTollywood news in telugu

Tollywood Heroes:టాలీవుడ్‌ హీరోల భార్యలు చేసే బిజినెస్లు ఏంటో తెలుసా?

Tollywood Heroes: టాలీవుడ్ లో హీరోలు ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికం తీసుకుంటున్నారు. అలాగే వారి భార్యలు కూడా బిజినెస్ చేస్తూ వారితో సమానంగా దాదాపుగా సంపాదిస్తున్నారు. అయితే స్టార్ హీరోల ఇమేజ్ ను వాడకుండా వారి భార్యలు తమ సత్తా ఏమిటో చాటుతున్నారు.

రామ్ చరణ్ భార్య మెగా కోడలు ఉపాసన అపోలో ఆస్పత్రిలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే యూట్యూబ్ ద్వారా సెలబ్రిటీలతో ఆరోగ్యకరమైన వంటకాలను వండిస్తు వాటిని అభిమానులకు,ప్రజల దగ్గరకు తీసుకువెళ్ళి ఆరోగ్యం పట్ల శ్రద్ద పెరిగేలా చేస్తున్నారు.

అల్లు arjun భార్య స్నేహ రెడ్డి సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ…మరో పక్క ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఎడిటర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

రాహుల్ రవీంద్రన్ భార్య సింగర్ చిన్మయి కూడా ఎన్నో బిజినెస్ లు చేస్తుంది. ఒక పక్క సినిమాలకు పాటలు పాడుతూ, మరో పక్క హీరోయిన్ లకు డబ్బింగ్ చెప్తూ కూడా చాలా సమర్ధవంతంగా బిజినెస్ లను చేస్తుంది.

కళ్యాణ్ రామ్ భార్య స్వాతి హైదరాబాద్‌లో ఓ వీఎఫ్ఎక్స్ కంపెనీని నడుపుతున్నారు.

మంచు విష్ణు సతీమణి వెరోనిక కూడా ఎన్నో వ్యాపారాలను చేస్తున్నారు.

అల్లరి నరేష్ భార్య విరూప ఈవెంట్ మేనేజర్ గా చేస్తూ బాగానే సంపాదిస్తుంది.

దగ్గుపాటి రానా భార్య మిహికా ఓ ప్రముఖ ఇంటీరియర్ సంస్థను నిర్వహిస్తోంది.

నాని భార్య అంజన ఆర్కా మీడియా సంస్థలో కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తుంది