Rachana: చిరంజీవి ‘బావగారూ బాగున్నారా’ సినిమా హీరోయిన్ రచన గుర్తుందా…ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా..?
Tollywood heroine Rachana: రచన మెగాస్టార్ చిరంజీవి, శ్రీకాంత్, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించి చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల్లో మంచి స్థానాన్ని సంపాదించింది. రచన.. పూర్తి పేరు జుం జుం బెనర్జీ. సినీ పరిశ్రమకు వచ్చాక పేరు రచనగా మార్చుకుంది. తెలుగుతోపాటు.. హిందీ, తమిళ్, కన్నడ, ఒడియా సినిమాల్లో నటించింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే 2007లో ప్రోబల్ బసును పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబానికి తన మొత్తం సమయాన్ని కేటాయిస్తుంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు బెంగాలీలో ఓ ప్రముఖ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. అయితే రచన మాత్రం సోషల్ మీడియాలో యాక్టివ్ గా అస్సలు ఉండదు.
Click Here To Follow Chaipakodi On Google News